బోయపాటితో బాలయ్య - ప్లాన్ ఏంటి ?

Update: 2019-01-23 05:36 GMT
ఎంత స్టార్ డైరెక్టర్ అయినా ఒక్క సినిమా ఫలితం ఎంత ప్రభావం చూపుతుందో బోయపాటి శీనుని చూస్తే తెలిసిపోతుంది. గతంలో కూడా రెండు మూడు ఫ్లాపులు ఇచ్చినా ఈ రేంజ్ విమర్శలు అతనికి ఎప్పుడూ రాలేదు. ఆఖరికి వయొలెన్స్ తో విసిగించిన దమ్ముని ఇష్టపడిన అభిమానులు ఉన్నారు కానీ వివిఅర్ మాత్రం వారు వీరు అనే తేడా లేకుండా అందరు దుమ్మెత్తిపోసేలా చేసింది. దీని విడుదలకు ముందే ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ లో నెక్స్ట్ మూవీ బాలకృష్ణతోనే అని స్టేజి మీద ప్రకటించిన బోయపాటి ఇప్పుడు ఎక్కడ దొరకడం లేదు. మీడియా మైకు ముందుకు వస్తే ఏం అడుగుతారో తెలిసి సైలెంట్ గా సైడ్ అయిపోయాడు.

అయితే బాలకృష్ణతో నిజంగా ఇతని సినిమా ఉంటుందా అనే దాని మీదే నందమూరి అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఒకపక్క బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు ఫలితం ఇచ్చిన షాక్ తో పూర్తి దృష్టి మహానాయకుడు మీదే పెట్టాడు. ఊహించని ఫలితం కావడంతో పాటు బయ్యర్లకు విపరీతమైన నష్టాలు రావడంతో ఆ అప్రతిష్ట నుంచి ఎలా బయటపడాలా అనే దాని మీద కూడా చాలా అలోచిస్తున్నరట. మరిప్పుడు బాలయ్య కొత్త సినిమా గురించి ఆలోచించే మూడ్ లో ఉన్నాడా అంటే చెప్పడం కష్టమే. పైగా వినయ విధేయ రామ చూసాక బోయపాటి శీనుని గుడ్డిగా నమ్మేందుకు లేదు. సింహ లెజెండ్ ల రూపంలో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చినా అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. స్క్రిప్ట్ ని క్షుణ్ణంగా చదివి కాచి వడబోసి కాని ఓకే చెప్పడం కష్టం.

అందుకే బోయపాటి బాలయ్యకు సిద్ధం చేసుకున్న కథను మరోసారి పునఃపరిశీలనలో పెట్టాడట. హీరోయిజం హద్దులు దాటినా మాస్ ప్రేక్షకులు ఒప్పుకోరని కొత్త పాఠం నేర్చుకున్న నేపధ్యంలో అసలు ఇది వెంటనే మొదలవుతుందా లేక బాలకృష్ణ కొంత గ్యాప్ తీసుకుని తర్వాత చూద్దాం అంటాడా వేచి చూడాలి. నందమూరి ఫ్యాన్స్ మాత్రం బోయపాటి కంటే తమ హీరోతో చేయాలని ఉబలాటపడుతున్న అనిల్ రావిపూడిని లాక్ చేయమని కోరుతున్నారు. మహానాయకుడు విడుదల అయ్యాకే వీటికి సమాధానం దొరుకుతుంది


    
Full View
Tags:    

Similar News