• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కట్టప్ప ఏమైపోయారు?...

కట్టప్ప ఏమైపోయారు? కనిపించరేం?

By - Tupaki Desk
Update: 2021-06-15 09:30 GMT
'బాహుబలి' సినిమా వచ్చిన తరువాత అందరి నోట ఎక్కువగా వినిపించిన పేరు 'కట్టప్ప'. చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ పాత్ర అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సత్యరాజ్ ను ఎక్కడ చూసినా 'కట్టప్ప' అంటూనే పిల్లలు గుర్తుపడుతున్నారంటే, ఆ పాత్ర వాళ్లని ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. తమిళంలో సత్యరాజ్ సీనియర్ స్టార్ హీరో. అనువాద చిత్రాల ద్వారా ఆయన నిన్నటి తరం ప్రేక్షకులకు తెలుసు. కానీ 'బాహుబలి'తోనే ఆయన ఈ తరం ప్రేక్షకులకు బాగా తెలిశారు. తెలుగులో 'మిర్చి' తరువాత ఆయనకి ఈ పాత్ర తగలడం నిజంగా అదృష్టం.

'కట్టప్ప' పాత్ర తీసుకొచ్చిన క్రేజ్ తో సత్యరాజ్ కి తెలుగు నుంచి వరుస అవకాశాలు వెళ్లాయి. 'జెర్సీ' .. 'ప్రతిరోజూ పండగే'  సినిమాల్లో ఆయనకి మంచి పాత్రలు పడ్డాయి. 'ప్రతిరోజూ పండగే' సినిమాలో కథ అంతా కూడా ఆయన పాత్రను కేంద్రంగా చేసుకుని నడుస్తుంది. ఈ సినిమాలో ఆయన పోషించిన రఘురామయ్య పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా తరువాత కరోనా అనేది కాలు పెట్టడంతో, సినిమాల నిర్మాణాలు .. విడుదల కార్యక్రమాలు అన్నీ ఆగిపోయాయి.

లాక్ డౌన్ సమయానికి చాలామంది ఆర్టిస్టులు చాలా సినిమాలను ఒప్పేసుకుని ఉన్నారు.

కానీ సత్యరాజ్ పేరు మాత్రం ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు. లాక్ డౌన్ తరువాత మొదలైన సినిమాల్లో కూడా ఆయన పేరు వినిపించలేదు. ఇక త్వరలో ఆయన చేయనున్న సినిమాల్లో తెలుగు నుంచి ఒకటే ఉంది .. అదే 'పక్కా కమర్షియల్'. మారుతి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో సత్యరాజ్ ఒక కీలకమైన పాత్రను పోషించనున్నారు. తమిళ సినిమాలు మాత్రం ఓ అరడజను వరకూ ఆయన చేతిలో ఉన్నాయి. తమిళంలో బిజీగా ఉండటం వలన సత్యరాజ్ తెలుగు సినిమాలను తగ్గించారా? లేదంటే తెలుగు నుంచి ఆయనకి అవకాశాలు వెళ్లడం లేదా? అనేదే అర్థం కావడం లేదు.
Tags:    
  • satya raj 
  • satya raj movies 
  • satya raj prati roju pandage 
  • jersey 
  • bahubali 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS