హంసలాంటి హన్సిక ఏమైపోయిందబ్బా?
హన్సిక అంటే అందం ... హన్సిక అంటే ఆకర్షణ .. హన్సిక అంటే వెండితెరపై వెన్నెల బొమ్మ. కుర్రాళ్ల కలల వనంలో విరబూసిన బంగారు కొమ్మ. హన్సిక తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి తమిళ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. తెరపై ఆమెను చూసిన టాలీవుడ్ కుర్రాళ్లు ఆ రంగేంటి .. ఆ పొంగేంటి? అంటూ ఆశ్చర్యపోయారు. అవి కళ్లా? .. మత్తుమందు నింపిన మందు పాత్రలా? అనుకున్నారు. అందమైన హంసలాంటి ఈ పిల్లకు అభిమానులైపోయారు.
ఇక ఈ కోమలిని తెరపై చూసిన కోలీవుడ్ కుర్రాళ్లు, ఈ అమ్మాయి దేవలోకం నుంచే వచ్చిందని ఫిక్స్ అయ్యారు. కాదు ముంబై నుంచి వచ్చిందంటే, అయితే ఆకాశం నుంచి ముందుగా అక్కడే దిగి ఉంటుందని అన్నారు. మానవ కన్యలకు ఇంతటి సౌందర్యం సాధ్యం కాదని కూడా తేల్చారు. ఆ క్షణం నుంచి ఆమె వీరాభిమానులుగా మారిపోయారు. పెద్దగా ఆలస్యం చేయకుండా ఆమెకి గుడి కట్టేసి భక్తులైపోయారు. ఈ మాత్రం క్రేజ్ చాలు లైఫ్ లో సెటిలైపోవడానికి అనుకుంటూ హన్సిక దూసుకుపోయింది. అక్కడ గట్టి పోటీ ఉన్నప్పటికీ గ్లామర్ తో నెట్టుకొచ్చేసింది.
అయితే ఆ మధ్య మరీ లావైపోయాననుకుందో ఏమిటో, సన్నజాజిమొగ్గలా సన్నబడిపోయింది. చక్కనమ్మ చిక్కినా అందమేనని తెలుగు ప్రేక్షకులు అనుకున్నారు. చక్కనమ్మ చిక్కితే ఎట్లాగమ్మా అని తమిళ ఆడియన్స్ అన్నారు. అప్పటి నుంచే ఈ పాల బుగ్గల పిల్లకి అవకాశాలు తగ్గడం మొదలైంది. ఇండస్ట్రీ ఇరుకేం కాదు కాబట్టి ఈ లోగా డజన్ల కొద్దీ కొత్త హీరోయిన్లు వచ్చేశారు. దాంతో అవకాశాలు మరింతగా మందగించాయి. దూకుడు మీద ఉన్నప్పుడే గ్లామరసంతో పాటు నటన ప్రధానమైన పాత్రలను కూడా చేసుంటే, ఈ సుందరి ఇంకొంతకాలం చక్రమ్ తిప్పేసేదే!