ఆ రెండూ ఉంటేనే లోకల్ ఓటీటీలకు ఆదరణ!

Update: 2020-05-17 01:30 GMT

లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత అదేపనిగా వినిపిస్తున్న పేరు ఓటీటీలు.  సహజంగా టీవీ ఛానెల్స్ లో వారు ఏది ప్రసారం చేస్తే అదే చూడాలి.  నచ్చకపోతే వేరే ఛానెల్ మార్చుకోవాలి.  అదీ లేకపోతే టీవీ ఆపేయాలి.  అయితే  ఓటీటీలు అలా కాదు. మెనూలో ఉన్న సినిమాలు.. వెబ్ సిరీస్ ల నుంచి ఏది కావాలంటే అది ఎంచుకుని చూడవచ్చు.  ఎప్పుడు కావాలంటే ఎప్పుడు.. ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు చూడవచ్చు.

పైగా ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొత్త సినిమాలు ఉండడంతో జనాలకు పండగగా ఉంది. ఇంకా ఎన్నో భాషల  సినిమాలు కూడా అందుబాటులో ఉండడం కూడా ప్రేక్షకులకు ఆప్షన్స్ ఎక్కువ అయ్యేలా చేసింది. టీవీలో మాత్రమే కాకుండా ఫోన్ లోనూ.. లాప్ టాప్.. టాబ్ లో కూడా చూడగలిగే అవకాశం ఉండడంతో ఎక్కువమంది ఓటీటీల వైపు మొగ్గు చూపిస్తున్నారు.  అయితే అన్నీ ఓటీటీలకు ఒకే రకమైన ఆదరణ ఉందని అనుకోవడం భ్రమ.

ప్రైమ్ వీడియో.. నెట్ ఫ్లిక్స్.. డిస్నీ+హాట్ స్టార్.. సన్ నెక్స్ట్ లాంటి వాటికి ఎక్కువ ఆదరణ ఉంది. వీటిలో సన్ నెక్స్ట్ తప్ప మిగతా అన్నీ అంతర్జాతీయ సంస్థలే.  హాట్ స్టార్ ఇండియావారిదే కానీ డిస్నీ వారు టై అప్ అయ్యారు.  సన్ నెక్స్ట్ వారు నెట్ ఫ్లిక్స్ తో టై అప్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ ఉంది.  ఇక లోకల్ ఓటీటీలను మన జనాలు ఎగబడి ఏమీ చూడడం లేదు. దీనికి కారణాలు రెండు.. ఒకటి అత్తెసరు కంటెంట్. రెండవది.. టెక్నికల్ ఇష్యూస్.  

ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లేయర్స్ కంటెంట్ పై పెట్టే ఖర్చుభారీ స్థాయిలో ఉంటుంది.  వాటితోమన లోకల్ ప్లేయర్స్ పోటీపడలేకపోతున్నారు.  ఇక లోకల్ ఓటీటీలలో కంటెంట్ స్టాండర్డ్ మరింతగా పెరగాల్సి ఉంది.  జీ5.. ఆహ లాంటి లోకల్ ఓటీటీలలో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని కొందరు యూజర్లు  కంప్లయింట్లు చేస్తున్నారు. ఒక వైపు కంటెంట్ రెండోవైపు టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మంచి యూజర్ ఎక్స్ పీరియన్స్ ఉంటేనే ప్రేక్షకులు మన లోకల్ ఓటీటీలను ఆదరిస్తారు.  


Tags:    

Similar News