• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మా' ఎన్నికలపై...

'మా' ఎన్నికలపై బొమ్మరిల్లు సిద్దు ఏమన్నాడంటే..!

By - Tupaki Desk
Update: 2021-10-09 07:32 GMT
గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా కూడా మా ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మా ఎన్నికల హడావుడి గురించి.. గెలుపు ఓటముల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రీలోని 24 క్రాప్ట్స్ కు చెందిన వారు కూడా మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయాన్ని చర్చించుకుంటూ కనిపిస్తున్నారు. మా ఎన్నికల్లో గెలుపు ఓటముల విషయం గురించి గతంలో పెద్దగా చర్చ ఉండేది కాదు. కాని ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇద్దరు కూడా ప్రచారం చేయడంతో పాటు ఇద్దరు వ్యక్తిగతంగా మాటల యుద్దంకు దిగడం మొదలుకుని చాలా విషయాల్లో మా ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షించారు. కొందరు మా ఎన్నికల రగడపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం తమ సపోర్టర్స్ ను సమర్థిస్తూ ముందుకు వెళ్తున్నారు.

ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్‌ గతంలో మాదిరిగా ఈసారి కూడా ఎన్నికలకు దూరంగానే ఉండాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే కొందరు మాత్రం ఎన్నికల్లో పాల్గొనాలి అనే ఉద్దేశ్యంతో ఉన్నారు. గతంలో ఎప్పుడు లేనంతగా ఈసారి మా ఎన్నికల్లో పోలింగ్ జరగాలని మంచు విష్ణు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. పోస్టల్ బ్యాలెట్‌ అవకాశం కూడా ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మా ఎన్నికల్లో ఈసారి మెజార్టీ పోలింగ్ శాతం నమోదు అవుతుందని అంటున్నారు. ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో 40 శాతం పోలింగ్ జరిగితేనే పెద్ద విషయంగా భావించే వారు. కాని ఈసారి 60 కి పైగా పోలింగ్‌ శాతం నమోదు అవుతుందని అంటున్నారు. తాజాగా ఈ ఎన్నికలపై హీరో సిద్దార్థ్‌ స్పందించాడు.

తమిళ నటుడు అయినా కూడా తెలుగు లో ఈయనకు మంచి గుర్తింపు ఉంది. బొమ్మరిల్లు సిద్దార్థగా అందరు గుర్తించే ఈయన ఈమద్య కాలంలో కాస్త గ్యాప్ ఇచ్చాడు. చాలా కాలం తర్వాత మాహాసముద్రం అనే సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ను టాలీవుడ్ లో మొదలు పెడుతున్నాడు. దసరారకు మహాసముద్రం విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మా ఎన్నికల విషయమై నేను రెండు వైపుల వారి మాటలు వింటున్నాను. మా సభ్యుడిగా నేను ఒక మంచి ప్యానల్‌ ను ఎంపిక చేసుకునేందుకు గాను నా మా ఓటు హక్కును వినియోగించుకుంటాను అంటూ సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు. సిద్దార్థ్‌ బొమ్మరిల్లులో ప్రకాష్‌ రాజ్ కొడుకు పాత్రలో నటించాడు. అప్పటి నుండే ఇద్దరి మద్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కనుక సిద్దు ఓటు ప్రకాష్‌ రాజ్ కు పడే అవకాశం ఉందని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు. మరి సిద్దు ఓటు ఎవరికి అనేది సస్పెన్స్‌ గా మారింది. ఆయన బయటకు చెప్పడు.. తెలిసే అవకాశం లేదు కనుక ఎవరికి తోచింది వారు ఊహించుకోవడమే.




Tags:    
  • Bommarillu Siddharth 
  • MAA 
  • Hyderabad 
  • Tollywood 
  • Movies 
  • Latest news 
  • MAA Elections 
  • Tollywood 
  • Actors 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS