కారు వదిలేసి రోడ్డు పై బైక్ తీసుకెళ్లిన స్టార్ హీరో అసలేం జరిగింది??
ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మాస్టర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ పోషించిన విజయ్ సేతుపతి ఎక్కువగా మార్కులు కొట్టేసాడు. నిజానికి విజయ్ సేతుపతి హీరో పాత్రలే చేయాలనీ ఫిక్స్ అవ్వకుండా ఏదైనా మంచి పాత్ర దొరికితే చాలు అంటూ ఓకే చెప్పేస్తున్నాడు. హీరోగా కాకుండా సేతుపతి ఒక నటుడుగా అద్భుతమైన ఫేమ్, నేమ్ సొంతం చేసుకున్నాడు. మాస్టర్ విలన్ పాత్రలో విజయ్ భీభత్సం సృష్టించాడనే చెప్పాలి. ఎందుకంటే మాస్టర్ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే అందులో హీరోకంటే కూడా విలన్ హైలైట్ అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐతే అదేవిధంగా విజయ్ సేతుపతి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉప్పెన సినిమాతో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు. విలన్ రాయణం పాత్రలో విలనిజం పండించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.
అయితే ప్రస్తుతం విజయ్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తన 46వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు సేతుపతి. ఈ సినిమాకు పోన్రామ్ దర్శకత్వం వహిస్తుండగా.. సమ్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఓ రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లుగా సమాచారం. అయితే ఇందులో పలు సన్నివేశాలను రోడ్డు పై చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ సందర్బంగా తమ అభిమానహీరో షూటింగ్ జరుగుతుందని పెద్దఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. వారిని కంట్రోల్ చేయడానికి హీరో, సెక్యూరిటీ ప్రయత్నించినా వారు అదుపుకాలేదు. చేసేదేం లేక చిత్రబృందం ప్యాకప్ చెప్పడంతో విజయ్ ఫ్యాన్స్ మధ్య నుండి తన కారు వద్దకు వెళ్లడానికి ట్రై చేసాడు. అయినా సరే అభిమానులు పోనివ్వకపోవడంతో పక్కనే ఉన్న టీమ్ లో ఒకరి బైక్ వేసుకొని విజయ్ వెళ్లిపోయాడట. ఇదిలా ఉండగా.. అక్కడి ట్రాఫిక్ పోలీసులు చిత్రబృందం నిబంధనలు పాటించట్లేదని జరిమానా విధించారట. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.