పార్టీ టైం : 'బుట్టబొమ్మ'కు చిందేసిన వార్నర్ సేన
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ ఉన్నన్నాళ్ళు అదిరిపోయే సాంగ్ లకు స్టెప్పులు వేసి క్రికెట్ అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. వార్నర్ తన భార్యతో కలిసి పలు తెలుగు సినిమాల పాటలకు డ్యాన్స్ చేసి అందరినీ మైమరిపించారు. ముఖ్యంగా అలవైకుంఠపురము లో సినిమాలోని బుట్ట బొమ్మ, రాములో రాములా సాంగ్స్ కి వార్నర్ చేసిన డ్యాన్స్ అందరికీ బాగా నచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్లో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకోవడంతో వార్నర్ సేన సంబరాల్లో మునిగి పోయింది. వరుసగా పార్టీలు చేసుకుంటూ టీం సభ్యులంతాఎంజాయ్ చేస్తున్నారు. దీంతో మరోసారి వార్నర్ బుట్ట బొమ్మ సాంగ్ కు కాలు కదిపాడు. ఇదివరకు పలు సార్లు వార్నర్ తన భార్యతో కలిసి ఈ పాటకి స్టెప్పులు వేశాడు. ఇప్పుడు మరోసారి వార్నర్ ఆ పాటకు చిందులేశాడు. అయితే ఒక్కడిగా కాదు.. తన టీం సభ్యులతో డ్యాన్స్ వేయించి అదరగొట్టాడు.
లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి మ్యాచ్ ముంబైతో తలపడింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే చావో రేవో లాంటి మ్యాచ్ లో వార్నర్, సాహా సూపర్ బ్యాటింగ్ తో బలమైన ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఈ సందర్భంగా వార్నర్ మాట్లాడుతూ విజయాల క్రెడిట్ అంతా జట్టు యాజమాన్యాని దేనని గెలుపు ఓటములతో సంబంధం లేకుండా తమను ఎంతో ప్రోత్సహించిందని వార్నర్ తెలిపాడు. అందువల్లే తాము ప్లే ఆఫ్స్‌కు చేరుకోగలిగామని చెప్పాడు. ప్రస్తుతం పార్టీ మోడ్ లో ఉన్న వార్నర్ సేన ‘బుట్ట బొమ్మ’ పాటకు డ్యాన్స్ కు ఇరగదీయగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.