అతిగా మద్యం సేవించడంపై ప్రఖ్యాత గాయని పశ్చాత్తాపం!
`నేను సాధారణ స్థాయి కంటే ఎక్కువగా మద్యానికి బానిసయ్యాను.సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఎదురయ్యే ఒత్తిళ్లు , వ్యక్తిగత కారణాల మద్యం అలవాటు చేసుకున్నాను. కాలక్రమంలో అదే అలవాటుకు బానిసగా మారాను.;
సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న పంజాబీ గాయని జాస్మిన్ శాండ్లాస్. ఇటీవల అమ్మడు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ చీకటి కోణాన్ని ధైర్యంగా పంచుకుంది. గతంలో అమ్మడు ఎదుర్కొన్న మద్యపాన వ్యసనం, ఆ సమయంలో జాస్మిన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలపై తొలిసారి మనసు విప్పి మాట్లాడింది. ఒకానొక దశలో తన జీవితంపై నియంత్రణ కోల్పోయినట్లు బాహాటంగా అంగీకరించింది.
`నేను సాధారణ స్థాయి కంటే ఎక్కువగా మద్యానికి బానిసయ్యాను.సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఎదురయ్యే ఒత్తిళ్లు , వ్యక్తిగత కారణాల మద్యం అలవాటు చేసుకున్నాను. కాలక్రమంలో అదే అలవాటుకు బానిసగా మారాను.
అది మానసికంగా , శారీరకంగా ఎంతో కృంగదీసింది. ఆ సమయంలో జరిగిన పరిణామాలను తలుచుకుంటే చాలా బాధగా ఉంటుందని` తెలిపింది. మద్యం మత్తులో ఉన్నప్పుడు నేను తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల జాస్మిన్ తాజాగా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసింది. ఆ నిర్ణయాలు తన కెరీర్‌పైనే కాకుండా వ్యక్తిగత సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపాయంది. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి మానసిక ప్రశాంతత చాలా అవసరమని, కానీ వ్యసనం వల్ల తన ఆలోచనా శక్తి మందగించిందని అభిప్రాయపడింది. గతంలోని ఆ చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ తనను వెంటాడుతున్నాయని నిజాయితీగా ఒప్పుకుంది.
ఇలాంటి వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడానికి చాలా మంది సెలబ్రిటీలు ఆలోచిస్తారు. వీలైనంత వరకూ గోప్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కానీ జాస్మిన్ మాత్రం తనలో మరోకరు కాకూడదు అన్న ఉద్దేశం, సామాజిక దృక్ఫథంతో ఓపెన్ అయింది. మధ్యం అనే పతనం నుంచి జాస్మిన్ కోలుకున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. తప్పును తెలుసుకున్న తర్వాత ఆ వ్యసనం నుంచి బయటపడటానికి ఆమె ఎంతో కృషి చేసానంది. ఇప్పుడు తాను పూర్తి ఆరోగ్యకరమైన జీవనశైలిని గడుపుతున్నానని, మద్యం నుంచి పూర్తిగా దూరంగా ఉంటున్నానని స్పష్టం చేసింది.
ఈ మార్పు తన సంగీతంలో, దైనందిన జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని సంతోషం వ్యక్తం చేసింది. జాస్మిన్ అనుభవాలను పంచుకోవడం ద్వారా సమాజానికి, ముఖ్యంగా యువతకు ఓ బలమైన సందేశాన్ని ఇచ్చినట్లు అయింది. గ్లామర్ ప్రపంచంలో కనిపించే మెరుపుల వెనుక ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఉంటాయని, కానీ వ్యసనాలకు లోనై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జాస్మిన్ యువతని కోరింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం కోసం ప్రయత్నించాలే తప్ప తాత్కాలిక ఉపశమనం కోసం మద్యం జోలికి వెళ్లకూడదని హెచ్చ రించింది. ప్రస్తుతం జాస్మిన్ శాండ్లాస్ తిరిగి సంగీతం, గాత్రంపై దృస్టి పెట్టి పనిచేస్తోంది. గతాన్ని ఓ పాఠంగా భావించి, భవిష్యత్తులో మంచి పాటలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇటీవలే రిలీజ్ అయిన` `ధురంధర్ ` లో `శరారత్` పాటలో ఐటం భామగా, గాయని ఏ రేంజ్లో అలరించిందో తెలిసిందే.