అందుకే ఆవిడ అక్కినేని కోడ‌లుకి స్ఫూర్తి

Update: 2020-06-26 06:00 GMT
ఏదైనా ఒక ఇన్నోవేటివ్ థాట్ త‌న‌ని వెంటాడితే దానిని సినిమాగా నిర్మించేందుకు ఎంత‌మాత్రం అభ్యంత‌రం ఉండ‌ద‌ని.. అస్స‌లు భ‌య‌ప‌డ‌న‌ని అంటున్నారు బాలీవుడ్ నిర్మాత కం న‌టి అనుష్క శ‌ర్మ‌. ఇప్ప‌టికే కెరీర్ లో ఎన్నో ప్ర‌యోగాత్మ‌క స్క్రిప్టుల‌తో సినిమాల్ని నిర్మించిన గ్రేట్ స్టార్ గా పాపుల‌రైన అనుష్క శ‌ర్మ తాజాగా `బుల్ బుల్` అనే చిత్రాన్ని నిర్మించారు. డిజిట‌ల్ లో విశేష ఆద‌ర‌ణ ద‌క్కిన సంద‌ర్భంగా తాజా మీడియా చిట్ చాట్ లో ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు.

మ‌హిళా స్వేచ్ఛ‌.. స్వాతంత్య్రం .. ధైర్యంపై సినిమా బుల్ బుల్. త‌న సినిమాల ద్వారా ఈ త‌ర‌హా కంటెంట్ ని చూపించేందుకు నిరంత‌రం ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తాన‌ని అనుష్క శ‌ర్మ వెల్ల‌డించింది. తాజాగా తాజా నిర్మాణ సంస్థ నుంచి వ‌స్తున్న `బుల్ బుల్` ఆ దిశలో ఒక అడుగు అని తెలిపింది. సోద‌రుడు క‌ర్ణేశ్ తో క‌లిసి క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మించింది.

మ‌హిళ‌ల ఆత్మ‌ను వ్య‌క్త‌ప‌రిచే ప్ర‌య‌త్న‌మే ఇది. మేం ఎల్లప్పుడూ బలమైన స్వతంత్ర భావాలు క‌లిగిన మహిళలను సినిమా ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నాం. మేం ఎప్పుడూ వ‌క్ర‌మార్గంలో లేం.  నా ప్రొడక్షన్స్ ద్వారా నేను చేయగలిగినంతవరకు దీన్ని సరిదిద్దుకుంటాను అని తెలిపారు. ఒక్కోసారి అస్త‌వ్య‌స్థంగా ఆలోచిస్తే క‌ర్ణేశ్ దానిని స‌రి చేశాడ‌ని కూడా తెలిపారు అనుష్క‌. ఇటీవ‌లే రిలీజైన డిజిట‌ల్లో రిలీజైన‌ బుల్ బుల్ కి విశేష ఆద‌ర‌ణ ద‌క్కుతోంద‌ని తెలిపింది. ఇటీవ‌ల రిలీజైన వెబ్ మూవీస్ లో పాతాళ్ లోక్ త‌ర్వాత బుల్ బుల్ కి గొప్ప సమీక్షలు ద‌క్కాయ‌ని వెల్ల‌డించింది.

న‌టిగా.. నిర్మాత‌గా అనుష్క శ‌ర్మ ఎన్నో విజ‌యాల్ని సాధిస్తోంది. అందుకే త‌న‌ని ఆద‌ర్శంగా తీసుకుని టాలీవుడ్ స్టార్ అక్కినేని స‌మంత కూడా అదే బాట‌లో వెళుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌హిళా ప్ర‌ధాన ఇతివృత్తాల‌తో మునుముందు సినిమాల్ని నిర్మించేందుకు స‌మంత ప్లాన్ చేస్తున్నారు. ఆ త‌ర‌హా క‌థాంశాల్ని ఎంక‌రేజ్ చేస్తూ న‌టిగానూ దూసుకెళుతున్న సంగ‌తి విధిత‌మే.
Tags:    

Similar News