నిర్మాత‌గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా!

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రైనా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొంత సంపాదించిన త‌ర్వాత సొంతంగా నిర్మాణ సంస్థ‌ను స్థాపించి నిర్మాత‌ల‌వుతారు.;

Update: 2026-03-01 17:30 GMT

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రైనా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొంత సంపాదించిన త‌ర్వాత సొంతంగా నిర్మాణ సంస్థ‌ను స్థాపించి నిర్మాత‌ల‌వుతారు. న‌య‌న‌తార‌, స‌మంత‌, తాప్సీ , అలియాభ‌ట్, ప్రియాంక చోప్రా, ఛార్మీ వీళ్లంతా హీరోయి న్ల‌గా ఎంట‌ర్ అయి కొంత డ‌బ్బు సంపాదించిన త‌ర్వాత సొంత బ్యాన‌ర్లు స్థాపించారు. వీరిలో కొంత మంది నిర్మాణాన్ని పుల్ టైమ్ గా ఎంచుకుని ప‌ని చేస్తుండ‌గా మ‌రికొంత మంది హీరోయిన్ గా కొన‌సాగుతూ నిర్మాత‌గానూ ప‌ని చేస్తున్నారు. కానీ `స‌ర్వం మాయ` బ్యూటీ రియా శిబు జ‌ర్నీ మాత్రం వీరింద‌రికీ భిన్నంగా ఉంది.



 


చాలా మందికి తెలియని విషయం ఏంటంటే? రియా శిబు నటిగా కెమెరా ముందుకు రాకముందే సినిమా నిర్మాణ రంగంలో ప్రొడ‌క్ష‌న్ డిపార్ట్ మెంట్ లో అనుభ‌వం గడించింది. అమ్మ‌డు కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలలో ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌ పనులను పర్యవేక్షించింది. సినిమా ఎలా తయారవుతుంది? సెట్స్‌లో పనులు ఎలా జరుగుతాయి? అనే విషయాలపై ఆమెకు పూర్తి అవగాహన ఉంది. ఆ నాలెడ్జ్ తో సొంతంగా నిర్మాణ సంస్థ‌ను స్థాపించింది.

ఆమె స్వయంగా కొన్ని ప్రాజెక్టులకు నిర్మాణ భాగస్వామిగా - ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది.

ఇలా కొంత కాలం కెమెరా వెనుకుండి పని చేసింది. క‌ళా రంగంలో క‌ళాకారిణిగా ముద్ర వేయాల‌నుకుంది. దీనిలో భాగంగా కెమెరా ముందుకొచ్చి హీరోయిన్ అయింది. `సర్వంమాయ` చిత్రం రియాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో అమ్మ‌డు తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకుంది. కేవలం గ్లామర్ పాత్ర‌ల‌కే పరిమితం కాకుండా, కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోంది. నిర్మాణ రంగంపై ఉన్న అవగాహన వల్ల అమ్మ‌డు ఒక సినిమా బడ్జెట్ , టెక్నికల్ అంశాలను కూడా అర్థం చేసుకోగలదు.

ఇది ఒక నటిగా ఆమెకు ప్లస్ పాయింట్. ఇండ‌స్ట్రీలో కొత్త నిర్మాత‌ల‌తో ప‌ని చేస్తున్న స‌మ‌యంలో త‌న అనుభ‌వంతో బ‌డ్జెట్ కంట్రోల్ చేయ‌గ‌ల్గుతుంది. నిర్మాత‌ల‌కు అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు, స‌ల‌హాలు సైతం ఇస్తుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు దృష్టంతా న‌ట‌న‌పైనే ఉంది. హీరోయిన్గా స్థిర‌ప‌డే ప్లాన్ లో ఉంది. దీనిలో భాగంగా ఏ భాష‌లో అవ‌కాశం వ‌చ్చినా కాద‌నుకుండా ప‌ని చేస్తుంది. తెలుగు సినిమాల‌పై ఎంతో ఆస‌క్తిగా ఉంది. ఇక్క‌డ న‌టీన‌టుల‌తో క‌లిసి ప‌ని చేయ‌డం త‌న‌కెంతో ఎగ్జెట్ మెంట్ ను అందిస్తుంద‌ని తెలిపింది.

Tags:    

Similar News