• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విష్ణు ప్లాన్ మంచిదే.....

విష్ణు ప్లాన్ మంచిదే.. వర్క్ అవుట్ కాలేదు!

By - Tupaki Desk
Update: 2019-03-24 06:46 GMT
మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం 'ఓటర్'. ఈ చిత్రం నిజానికి 2017 లోనే రిలీజ్ కావలిసి ఉంది. షూటింగ్ మొత్తం పూర్తయినా ఇంకా విడుదలకు నోచుకోకుండా ల్యాబ్ లోనే ఉంది. ఎన్నికల సీజన్ కాబట్టి రాజకీయాల నేథ్యంలో తెరకెక్కిన 'ఓటర్' కు డిమాండ్ ఉంటుందని భావించి ఏప్రిల్ లోనే ఈ సినిమాకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు విష్ణు రెడీ అయ్యాడు.  కానీ ప్రస్తుతం అందరి ఫోకస్ ఎలెక్షన్స్ మీదే ఉంది కాబట్టి 'అర్జున్ సురవరం' లాంటి ఇతర చిత్రాలు కూడా ఎలెక్షన్స్ పూర్తయ్యాక రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు బయ్యర్లు కూడా ఈ సీజన్లో రిలీజ్ అయ్యే సినిమలను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదట.
 
అసలే మంచు విష్ణు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరసగా ఫ్లాప్ అవుతున్నాయి. పైగా అన్ సీజన్ కావడంతో 'ఓటర్' రైట్స్ కోసం బయ్యర్లు ఎవరూ ముందుకు రావడం లేదట. ఇది గుర్తించిన 'ఓటర్' నిర్మాతలు ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రమోషన్స్ కూడా ఆపేశారు. ఈ లెక్కన 'ఓటర్' మరోసారి వాయిదా పడ్డట్టే.  ఇప్పటికే విడుదల చాలా ఆలస్యం అయిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడడం సినిమాపై నెగెటివిటీని పెంచేదే.

ఒకసారి ఎలెక్షన్స్ పూర్తయితే సమ్మర్ చిత్రాల జాతర మొదలవుతుంది కాబట్టి ఓటర్ కు స్లాట్ దొరకడం కూడా కష్టమే.  చూస్తుంటే 'ఓటర్' మేకర్స్ మరోసారి మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారనిపిస్తోంది. ఈ 'ఓటర్' కు మంచిరోజులు ఎప్పుడొస్తాయో..!
    

Tags:    
  • Vishnu manchu 
  • Voter Movie 
  • telugu news 
  • latest updates 

Similar News

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

Copyright @2026

Powered by Blink CMS