రెండు రోజుల్లో విష్ణు ఏదో చెప్తాడట

Update: 2016-04-14 15:30 GMT
ఎందుకో అసలు ''ఈడోరకం ఆడోరకం'' సినిమా ప్రమోషన్లలో అసలు వీడియో ఇంటర్యూల్లో మంచు విష్ణు కనబడితేనే ఒట్టు. పేపర్లో ఇంటర్యూలు ఇచ్చాడు కాని.. ఎలక్ర్టానిక్‌ మీడియా ముందుకు మాత్రం రాలేదు. అయితే ఈరోజు కెమెరాల ముందు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం.. ఒక పెద్ద హింటే ఇచ్చాడు.

ఈరోజు ఉదయం ప్రసాద్స్‌ ఐమ్యాక్స్‌ లో పొద్దున్నే వేసే షో ను హీరోలు విష్ణు - మనోజ్‌.. అలాగే దర్శకుడు నాగేశ్వరరెడ్డి.. అండ్ ఇతర ఈడోరకం ఆడోరకం టీమ్‌ కలసి వీక్షించారు. సినిమాను చూశాక మంచు మనోజ్‌ అన్నయ్యను తెగ పొగిడేశాడు. ఫ్రెండ్స్‌ బ్యాచ్‌ తో కలసి ఎంజాయ్‌ చేసే సినిమా ఇది అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇక దర్శకుడు - నిర్మాత.. ఇలా అందరూ మట్లాడారు కాని.. మంచు విష్ణు మాత్రం ''నేను రెండు రోజుల్లో మీడియాతో మళ్ళీ మాట్లాడతా'' అన్నాడు. అదే షాకింగ్‌ మరి.

అసలు విష్ణు మీడియాతో ఏం మాట్టాడతాడో ఏంటో. ఎందుకంటే ఈ సినిమాను ప్రొడక్షన్‌ లోకి తీసుకెళ్ళడానికి.. మనోడికి చానాళ్లు హీరో దొరకలేదు. తనతోపాటు మల్టీ స్టారర్‌ చేయడానికి చాలామంది నో చెప్పారంటూ ఆల్రెడీ చెప్పాడు. ఒకవేళ ఆ హీరోల గురించి పబ్లిక్‌ లో చెప్పేస్తాడా ఏంటి? సినిమా హిట్టయ్యాక మాట్లాడదాం అని వెయిట్‌ చేస్తున్నట్లున్నాడు.
Tags:    

Similar News