• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దసరా బరిలో దిగుతున్న...

దసరా బరిలో దిగుతున్న 'ఎనిమీ'

By - Tupaki Desk
Update: 2021-09-06 17:30 GMT
కోలీవుడ్ స్టార్ హీరోలు విశాల్ - ఆర్య కలిసి నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ''ఎనిమీ''. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ఇటీవల వచ్చిన టీజర్ - సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.

''ఎనిమీ'' చిత్రాన్ని దసరా పండుగ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వదిలిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. విశాల్ - ఆర్య ఇద్దరూ తీవ్ర గాయాలతో క్రూరంగా కనిపిస్తున్నారు. ఒకరిపై ఒకరు కోపంతో రగిలిపోతూ యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది.

'వాడు - వీడు' సినిమా వచ్చిన పదేళ్ల తర్వాత ''ఎనిమీ'' చిత్రంలో విశాల్ - ఆర్య స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇది శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథ అని తెలుస్తోంది. ఇందులో హీరో ఎవరు, విలన్ ఎవరనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. తెలుగు తమిళ హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని త్వరలోనే వెల్లడించనున్నారు.

'ఎనిమీ' చిత్రాన్ని మినీ స్టూడియోస్‌ పతాకంపై ఎస్. వినోద్‌ కుమార్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆర్‌డి రాజశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. రేమాండ్ డేర్రిక్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా.. శ్యామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్‌ - మమతా మోహన్ దాస్ - తంబి రామయ్య - కరుణాకరన్ ఇతర పాత్రల్లో నటించారు.
Tags:    
  • Enemy 
  • Kollywood 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS