'విరాటపర్వం' నుంచి వస్తున్న 'కోలు కోలు'..!

Update: 2021-02-22 12:48 GMT
దగ్గుబాటి రానా - సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''విరాటపర్వం''. 'రివ‌ల్యూష‌న్ ఈజ్ యాక్ట్ ఆఫ్ ల‌వ్' అనేది ఉపశీర్షిక. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్‌.ఎల్‌.వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కామ్రేడ్ రవి అన్న పాత్రలో రానా కనిపించనున్నాడు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న విడుద‌ల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

'విరాట పర్వం' సినిమా నుంచి 'కోలు కోలు' అనే సాంగ్ లిరికల్ వీడియోని ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా లంగావోణిలో ఉన్న సాయి పల్లవి డ్యాన్స్ పోజ్ కి సంబంధించిన ఓ పోస్టర్ ని వదిలారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నాడు. డానీ సాంచెజ్‌ లోపెజ్ - దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి - నివేథా పేతురాజ్ - నందితా దాస్‌ - నవీన్ చంద్ర - ఈశ్వ‌రీరావు - జ‌రీనా వ‌హాబ్ - సాయిచంద్ - బెనర్జీ - రాహుల్ రామకృష్ణ - నాగినీడు తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.


Tags:    

Similar News