ఆకాశాన్నంటుతున్న ప్రతినాయకుల పారితోషికాలు..!
ఒక సినిమాలో హీరో క్యారక్టర్ ఎలివేట్ అవ్వాలన్నా.. హీరోయిజం చూపించాలన్నా కథానాయకుడి పాత్రకు ధీటుగా ప్రతినాయకుడి పాత్ర కూడా ఉండాలి. విలన్ పాత్రలు హీరో స్థాయికి తగిన వ్యక్తులైతేనే నిండుతనం వస్తుందన్న భావనతో ఉంటారు. ఈ క్రమంలో క్రేజీ విలన్స్ కోసం దర్శక నిర్మాతలు భారీగానే ముట్ట చెబుతున్నారు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ మాత్రమే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు విలన్స్ కూడా భారీగా పారితోషకాలు అందుకుంటున్నారు. బాలీవుడ్ తర్వాత ఎక్కువ రెమ్యూనరేషన్ టాలీవుడ్ నుంచే అందుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర ఇండస్ట్రీల హీరోలు సైతం తెలుగు చిత్రాల్లో విభిన్న మరియు విలన్ పాత్రల్లో నటించేందుకు ఇష్టపడుతున్నారు. రెమ్యూనేషన్ తో పాటు మార్కెట్ విస్తరించుకునే అవకాశం కూడా ఉండటంతో ప్రతినాయకుడి పాత్రలు పోషించడానికి అందరూ ముందుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ విలన్స్ గా కొనసాగుతున్న వారి కాల్ షీట్స్ బాగా కాస్ట్లీగా మారుతున్నాయని తెలుస్తోంది. తమిళ హీరో విజయ్ సేతుపతి 'ఉప్పెన' సినిమా కోసం సుమారు 4 కోట్ల వరకు తీసుకున్నాడనే ప్రచారం జరిగింది. అలానే సోనూసూద్ ఒక్క రోజు కాల్షీట్ కి 20 లక్షల వరకు తీసుకుంటాడని.. అదే సినిమాకి 20 రోజులు కేటాయిస్తే 4 కోట్ల వరకు చార్జ్ చేస్తాడని టాక్. ఇక ఒకప్పటి హీరో జగపతి బాబు కూడా భారీగానే తీసుకుంటారని చెప్పుకుంటారు. ఒక సినిమాకి 3 నుంచి 4 కోట్ల వరకు తీసుకుంటాడని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సైతం పాజిటివ్ క్యారెక్టర్ అయినా నెగటివ్ క్యారెక్టర్ అయినా ఒక్కో సినిమాకి 2 కోట్లకి పైగానే డిమాండ్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే వారు ఆ రేంజ్ లో డిమాండ్ చేయడానికి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లేదా బైలింగ్విల్ అవడం కూడా కారణమనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనా ఇప్పుడు కథానాయకుల రెమ్యూనరేషన్స్ కి ధీటుగా ప్రతినాయకుల పారితోషకాలు కూడా ఉంటున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.