టాలీవుడ్ లో ఎంత మంది డాక్టర్ హీరోయిన్లు అంటే?
సినిమాల్లో అవకాశాలు వస్తున్నా? వైద్య వృత్తిని వదలకుండా రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుంది.;
సినిమా హీరోయిన్లు అంటే గ్లామర్ మాత్రమే కాదు. ఇక్కడ విద్యావంతులకు కూడా కొదవలేదు. ముఖ్యంగా వెండితెరపై మెరుస్తున్న పలువురు కథానాయికలు నిజ జీవితంలో కష్టతరమైన వైద్య విద్యను పూర్తి చేసి డాక్టర్ పట్ట బద్రులులు కొచాలా మందే ఉన్నారు. గ్లామర్ ప్రపంచంలోకి రాకముందే స్టెతస్కోప్ పట్టి రోగులకు సేవ చేసే స్థాయికి ఎదిగారు. తాత్కాలికంగా వైట్ కోట్ ను పక్కన బెట్టి నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అగ్ర కథానాయికల గురించి ఈ కథనం. `ఫిదా` తో పరిచయమైన సాయిపల్లవి టాలీవుడ్ లో ఎంత పెద్ద హీరోయిన్ గా ఎదిగిందో తెలిసిందే.
హైబ్రిడ్ పిల్లగా ఫేమస్ అయిన అమ్మడు జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అమ్మడు నటిగా ఎంత బిజీగా ఉన్నా? తన వృత్తిని గౌరవిస్తూ అప్పుడప్పుడు వైద్య సేవల్లోనూ భాగమవుతుంటుంది. నటనలో తనదైన సహజత్వాన్ని ప్రదర్శించే సాయి పల్లవి చదువులోనూ అంతే ప్రతిభావంతురాలు కావడంతో డాక్టర్ అయింది. మరో నటి రూపా కొడవాయుర్. `ఉమామహేశ్వర ఉగ్రరూపస్య` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ వృత్తిరీత్యా డాక్టర్. కరోనా వంటి క్లిష్ట సమయాల్లో ఆమె ఆసుపత్రిలో ఉండి రోగులకు సేవలు అందించడం అందరినీ ఆకట్టుకుంది.
సినిమాల్లో అవకాశాలు వస్తున్నా? వైద్య వృత్తిని వదలకుండా రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. చిన్న సినిమాల్లో కెమెరా ముందుకొచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రముఖ నటుడు రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ కూడా ఈ జాబితాలో ఉంది. ఆమె ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసి పట్టా అందుకుంది. రాజశేఖర్ కూడా డాక్టర్ కావడంతో తండ్రి వారసత్వాన్ని అటు చదువులోనూ, ఇటు సినిమాల్లోనూ కొనసాగిండచం విశేషం. చదువు పూర్తి చేసిన తర్వాతే శివానీ సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. మలయాళం బ్యూటీ సాయిపల్లవి కూడా ఉన్నత విద్యావంతురాలే.
`ప్రేమమ్` తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అలాగే తెలుగు నటి శ్రీలీల కూడా డాక్టర్ చదివిన సంగతి తెలిసిందే. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత డాక్టర్ పుస్తకాలు సినిమా సెట్ లో చదివి మరీ పాస్ అయిన నటి శ్రీలీల. నటిగా బిజీ అయినా? చదువును మాత్రం తానెంత మాత్రం అశ్రద్ద చేయలేదని ఆమె శ్రద్ద చెప్పకనే చెబుతుంది. శ్రీలీల మామ్ బెంగుళూరులో ఫేమస్ గైనకాలజిస్ట్ కావడంతో కుమార్తెను కూడా డాక్టర్ ను చేయాలనుకున్నారు.
ఆ క్రమంలోనే శ్రీలీల ఫ్యాషన్ గుర్తించి సినిమాలతో పాటు డాక్టర్ ను కూడా చేసారు. అమ్మలాగే కుమార్తె కూడా ఫేమస్ గైనకాలజిస్ట్ గా ఎదుగుతుందేమో. ఇంకా ఇండస్ట్రీలో డాక్టర్లుగా చెప్పుకోని నటీమణులు చాలా మంది ఉంటారు. నేటి తరం హీరోయిన్లు అందం మీదనే కాదు. చదువు మీద కూడా అంతే శ్రద్ధ చూపిస్తున్నారు. డాక్టర్ల వంటి బాధ్యతాయుతమైన వృత్తి నుంచి సినిమాల్లోకి రావడం వల్ల పరిశ్రమలో వారి పట్ల గౌరవం పెరుగుతోంది. ఇది రాబోయే తరానికి ఒక గొప్ప స్ఫూర్తినిస్తుంది. చదువు అనేది వ్యక్తిత్వ వికాసానికి ఎంత అవసరమో ఈ నటీమణులు నిరూపిస్తున్నారు.