థియేటర్లలో `దురంధర్` మేకింగ్ వీడియో.. టికెట్ కొని చూడాలా?
భారతీయ సినీ పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు ఆదిత్య ధర్. `యూరి- ది సర్జికల్ స్ట్రైక్స్` వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత అతడు రణవీర్ సింగ్‌తో `ధురంధర్` దురంధర్ 2 లాంటి సంచలన చిత్రాలను తెరకెక్కించారు.;
భారతీయ సినీ పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు ఆదిత్య ధర్. `యూరి- ది సర్జికల్ స్ట్రైక్స్` వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత అతడు రణవీర్ సింగ్‌తో `ధురంధర్` దురంధర్ 2 లాంటి సంచలన చిత్రాలను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడమే కాకుండా.. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారిగా ఒక చిత్రానికి సంబంధించిన `బిహైండ్ ది సీన్స్` (BTS) లేదా మేకింగ్ డాక్యుమెంటరీని థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. సాధారణంగా ఇలాంటి వీడియోలు డిజిటల్ వేదికలకే పరిమితం అవుతాయి.. కానీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం అనేది ఒక విప్లవాత్మక నిర్ణయంగా చెప్పాలి.
ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా `ధురంధర్` చిత్రంపై ప్రేక్షకుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్ కారణమని తెలుస్తోంది. రణవీర్ సింగ్ గెటప్.. హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఎలా చిత్రీకరించారో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. మేకింగ్ వీడియోను థియేటర్లో రిలీజ్ చేయడం వల్ల కేవలం వినోదమే కాకుండా... సినిమా వెనుక ఉండే సాంకేతిక నిపుణుల కష్టం.. అత్యాధునిక కెమెరాల వినియోగం .. గ్రాఫిక్స్ పనులను ప్రేక్షకులు పెద్ద స్క్రీన్‌పై చూసి ఆస్వాధించే అవకాశం కలుగుతుంది. ఇది సినిమాపై ఉన్న హైప్‌ను రెట్టింపు చేయడమే కాకుండా.. సినిమాతో ప్రేక్షకులకు ఒక భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పరుస్తుంది.
అయితే ఈ వినూత్న ప్రయోగంపై సినీ విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని ఒక అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీగా అభివర్ణిస్తుంటే.. మరికొందరు దీనిని అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నంగా భావిస్తున్నారు. కానీ ఆదిత్య ధర్ లాంటి మేకింగ్ స్టైల్ ఉన్న దర్శకుల పనితనం ఎలా పని చేసిందో వీక్షించేందుకు ఇదొక మంచి వేదిక అవుతుంది. మొబైల్ ఫోన్లలో చూసే మేకింగ్ వీడియోలకు.. థియేటర్లో సౌండ్ సిస్టమ్‌తో కూడిన విజువల్స్ కి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది ప్రేక్షకుడిని సినిమా ప్రపంచంలోకి ముందుగానే తీసుకెళ్తుంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన `ధురంధర్: ది రివెంజ్` బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో ఈ మేకింగ్ వీడియో రిలీజ్ అనేది ఇంకా థియేటర్లలో ఆడుతున్న సినిమాకి అదనపు బూస్ట్ ఇస్తుందనే భావించవచ్చు.
భారతీయ సినిమా మేకింగ్ వీడియోని థియేటర్లలో రిలీజ్ చేయడం అనేది మునుపెన్నడూ చూడనిది. ఈ ఐడియాతో ధురంధర్ ఒక సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా.. భవిష్యత్తులో ఇతర పెద్ద సినిమాలకు కూడా ఇదొక మార్గదర్శకంగా నిలుస్తోంది.
కేవలం కథనే కాకుండా... ఆ కథను తెరకెక్కించే ప్రక్రియను కూడా ఒక కళగా గుర్తించి థియేటర్లలో ప్రదర్శించడం గొప్ప పరిణామం. అయితే ఈ మేకింగ్ పై తీసిన చిత్రాన్ని ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాలి.