విక్రమ్ ‘బొంబాయి’ ఎందుకు మిస్సయ్యాడంటే..

Update: 2016-08-30 22:30 GMT
ఇప్పుడు విక్రమ్ స్టార్ హీరోనే కానీ.. తొంభైల్లో మాత్రం అతనో చోటా హీరో. తెలుగులో ‘బంగారు కుటుంబం’ లాంటి చిన్న సినిమాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలు చేశాడతను. తెలుగులో అయినా అంతో ఇంతో అవకాశాలొచ్చాయి కానీ.. తమిళంలో అయితే ఆమాత్రం కూడా లేదు. ప్రభుదేవా.. అబ్బాస్ లాంటి వాళ్లకు డబ్బింగ్ చెప్పుకుంటూ నెట్టుకొచ్చాడతను. ‘సేతు’ వచ్చాక కానీ అతడి ఫేట్ మారలేదు. ఐతే ఈ లోపు మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్‌తో పని చేసే అవకాశం వచ్చిందట విక్రమ్‌కు. కానీ అతను ఆ అవకాశాన్ని కాలదన్నుకున్నాడు. అందుకు రీజన్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ సంగతేంటో విక్రమ్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘బొంబాయి సినిమాను నేను వదలుకోలేదు. మణిరత్నం గారే నన్ను వదిలేశారు. ఆ సమయంలో నేను వేరే సినిమాకు కమిటయ్యాను. అందులో నాకు గడ్డం ఉంటుంది. జుట్టు కూడా పొడవుగా ఉంటుంది. ‘బొంబాయి’ కోసం క్లీన్‌ లుక్‌ అడిగారు మణి సార్. ఐతే ఆ సినిమా షూటింగ్ ఎప్పుడుంటుందో తెలియదు. ఉన్న అవకాశాన్ని వదులుకోలేను. ఆ సినిమా కోసం పెంచిన గడ్డం, జుట్టు తీసేయడానికి నేను ఒప్పుకోలేదు. ఈ విషయంలో నేను స్నేహితుల మాట కూడా వినలేదు. ఐతే అలా ఎందుకు చేశానా అని తర్వాత చాలా బాధపడ్డాను. ఆ సమయానికి నేను ఏదో టెన్షన్‌లో ఉన్నాను. ఇప్పుడున్నంత మెచ్యూరిటీ కూడా లేదు. శంకర్‌ - మణిరత్నంల దర్శకత్వంలో సినిమాలు చేయాలన్నది నా డ్రీమ్. ‘బొంబాయి’ సినిమాలో చేయకపోవడం నా జీవితంలో పెద్ద లాస్‌. ఐతే మణిరత్నంతో ‘రావణన్’ చేసే అవకాశం దక్కింది. ఆయన నాకు దేవుడితో సమానం’’ అని విక్రమ్ తెలిపాడు.
Full View

Tags:    

Similar News