రాజమౌళీ.. నీ టైటిల్ వాడేస్తున్నారయ్యా
బాహుబలి-2 మొదలవకముందే.. రాజమౌళి దీని తర్వాత చేయబోయే సినిమా ఏంటన్నదానిపై విపరీతమైన చర్చ జరిగింది కొన్ని నెలల కిందట. అప్పుడొచ్చిన రకరకాల వార్తల్లో భాగంగా బాగా చర్చనీయాంశమైన పేరు ‘గరుడ’. దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో జక్కన్న ‘గరుడ’ అనే సినిమా తీస్తాడని.. ఇందులో ఇండియాలోని వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు నటిస్తారని.. దీని ట్రైలర్ కోసమే పాతిక కోట్లు ఖర్చు చేస్తాడని ఆసక్తికర వార్తలు బయటికి వచ్చాయి. ఐతే నిజంగా రాజమౌళి ఆలోచనలు ఎలా ఉన్నాయో.. ఈ వార్తలు నిజానిజాలెంతో కానీ.. ఈ టైటిల్ అయితే రాజమౌళి సినిమాకు పెట్టుకునే అవకాశమైతే లేదని తేలిపోయింది.
ఎందుకంటే ‘గరుడ’ అనే టైటిల్ ను తమిళ స్టార్ హీరో విక్రమ్ వాడేస్తున్నాడు. తిరు అనే దర్శకుడితో విక్రమ్ చేయబోయే సినిమాకు ‘గరుడ’ అనే టైటిల్ పెట్టేశారు. ఈ టైటిల్ ను ఆ సినిమా నిర్మాత రిజిస్టర్ చేసేశాడు కూడా. మరి రాజమౌళి కూడా ఈ టైటిల్ రిజిస్టర్ చేయించాడా.. చేయిస్తే మరే భాషలోనూ వాడకుండా షరతులేమైనా ఉన్నాయా అన్నది తెలియట్లేదు. రాజమౌళి సినిమా అంటే ఇక ఏ ఒక్క భాషకో పరిమితం కాదు. తమిళంలోనూ భారీ స్థాయిలోనే విడుదలవుతుంది. కాబట్టి జక్కన్న ‘గరుడ’ టైటిల్ మీద ఆశలు వదులుకోక తప్పదు. లేదంటే విక్రమ్ ను కన్విన్స్ చేసి ఆ టైటిల్ తను తీసుకోవాలి.