కమల్ ఫ్యాన్స్‌ వంద కోట్ల కల తీరింది

Update: 2022-06-05 14:42 GMT
ఇండియన్‌ సినీ రంగంలో అద్బుతమైన నటుల లిస్ట్‌ తయారు చేస్తే అందులో కమల్‌ హాసన్ పేరు లేకుండా ఉండదు. దేశం గర్వించదగ్గ నటుడు కమల్‌ హాసన్‌. ఆయన పోషించినన్ని పాత్రలు ఇండియన్ స్క్రీన్‌ పై మరెవ్వరు వేయలేదు. అద్బుతమైన నటుడిగా ఎన్నో విజయాలను 80 మరియు 90 ల్లో అందుకున్న కమల్‌ హాసన్‌ ఈమద్య కాలంలో మాత్రం సక్సెస్‌ లు లేక ఢీలా పడి పోయాడు.

నటుడిగా ఆయన తన ప్రతి సినిమా కు వేరియేషన్స్ చూపిస్తూ ఉన్నా కూడా వసూళ్లు రాకపోవడంతో అభిమానులు ఒకింత ఆవేదనతో ఉన్నారు. చిన్నా చితక హీరోలు పాన్ ఇండియా స్టార్స్ అనిపించుకుంటున్నారు.. వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తున్నారు. కాని ఇప్పటి వరకు కమల్‌ హాసన్ నటించిన సినిమా వంద కోట్ల క్లబ్‌ లో చేరలేదు అనే చిన్న వెలితి ఇన్నాళ్లు ఫ్యాన్స్ లో ఉంది.

గతంలో ఆయన నటించి సూపర్‌ హిట్‌ అయిన సినిమాల వసూళ్లు ఇప్పటి వసూళ్లతో పోల్చితే రెండు మూడు వందల కోట్ల వసూళ్లతో సమానం. కాని ఈమధ్య కాలంలో ఆయన నుండి వంద కోట్ల సినిమా రాకపోవడమే విచారకరం అంటూ బాధపడుతున్న సమయంలో అప్పుడు వచ్చింది విక్రమ్ సినిమా. విడుదల అయిన రెండు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టి లాంగ్ రన్‌ లో వందల కోట్లను దక్కించుకునే సత్తా ఉన్న సినిమా అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

కమల్‌ హాసన్‌ కమర్షియల్‌ సినిమాల పై దృష్టి పెడితే పదుల కొద్ది వందల కోట్ల సినిమాలు వచ్చేవి. కాని ఆయన విభిన్నమైన చిత్రాలను చేయడం కోసం విభిన్న పాత్రలు చేయడం కోసం తాపత్రయ పడుతూ ఉంటాడు. అందులో భాగంగానే దశావతారం.. విశ్వరూపం వంటి సినిమాలు చేశాడు. కాని అవి వందల కోట్ల ను వసూళ్లు చేయలేక పోయాయి. ఇప్పుడు విక్రమ్‌ తో ఆ లోటు తీరినట్లు అయ్యింది.

ముందు ముందు రాబోతున్న కమల్‌ సినిమాలు ఇకపై వరుసగా వందల కోట్ల క్లబ్‌ లో చేరుతాయని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇండియన్ 2 ఇప్పటికే రావాల్సి ఉన్నా శంకర్‌ మరియు నిర్మాణ సంస్థ ల మధ్య విభేదాల కారణంగా వాయిదా పడింది. త్వరలో మళ్లీ ఇండియన్ 2 మొదలు అవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా కోసం కమల్‌ అభిమానులు వెయిటింగ్‌.
Tags:    

Similar News