బ‌న్ని- విక్ర‌మ్ 2019కి వాయిదా

Update: 2018-09-21 18:31 GMT
నా పేరు సూర్య‌` డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ అల్లు అర్జున్‌ ని పూర్తి క‌న్ఫ్యూజ‌న్‌ లోకి నెట్టేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా త‌ర్వాత వేరొక సినిమాలో నటించేందుకు బ‌న్ని ఎంత‌గానో ఆలోచించుకోవాల్సి వ‌చ్చింది. త‌న‌ని రీ ఇన్వెంట్ చేసుకునే ప‌నిలోనే ఉన్నాడింకా. ఆ క్ర‌మంలోనే విక్ర‌మ్.కె.కుమార్ వినిపించిన లైన్‌ కి ఓకే చెప్పి గ‌త ఏడాది కాలంగా త‌న‌తో ట్రావెల్ అవుతున్నాడు. విక్ర‌మ్ స్క్రిప్టుపై ద‌ప‌ద‌ఫాలుగా చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగించారు.

అయితే ఈ స్క్రిప్టులో బ‌న్ని కొన్ని కీల‌క‌ మార్పు చేర్పులు సూచించార‌ని - క‌మ‌ర్షియ‌ల్ అంశాల విష‌యంలో మ‌రింత‌గా గ్రౌండ్ వ‌ర్క్ చేయాల‌ని విక్ర‌మ్‌ కి సూచించార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. ఆ క్ర‌మంలోనే విక్ర‌మ్ ఎంతో శ్ర‌ద్ధ‌గా ఈ స్క్రిప్టుపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నాడు. అయినా ఇప్ప‌టికీ బ‌న్నితో ఓకే చేయించుకోవ‌డంలో త‌డ‌బ‌డుతున్నాడు. విక్ర‌మ్‌ త‌న‌దైన శైలిలో ఇన్నోవేటివ్ స్క్రిప్టు తీర్చిదిద్దినా ఇంకా ఏదో మిస్స‌య్యింద‌న్న రివ్యూల‌తో అందులో మార్పుల కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు.

అయినా ఇంకా ఈ స్క్రిప్టు విష‌యంలో బ‌న్నిలో ఏదో అసంతృప్తి నెల‌కొందిట‌. అందుకే ఇప్ప‌టికి ఇంకా విక్ర‌మ్‌ తో ప్రాజెక్టును ఖాయం చేయ‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. విక్ర‌మ్‌.కె సినిమా ఇప్ప‌ట్లో ఉండ‌ద‌ని తెలుస్తోంది. దీనిపై మ‌రింత టైమ్ తీసుకుని ఆలోచిద్దామ‌ని బన్ని విక్ర‌మ్‌ కి సూచించాడ‌ట‌. వ‌చ్చే ఏడాది వ‌ర‌కూ వేచి చూస్తాన‌ని అన్నాడ‌ట‌. ఇప్ప‌టికైతే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లే ఛాన్స్ లేద‌ని తెలుస్తోంది. సేమ్ టైమ్ త్రివిక్ర‌మ్ వినిపించ‌బోయే కొత్త స్క్రిప్టుపై బ‌న్ని ఆస‌క్తిగా ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ `అర‌వింద స‌మేత‌` చిత్రీక‌ర‌ణ పూర్త‌వ్వ‌గానే త్రివిక్ర‌మ్ త‌న స్క్రిప్టును బ‌న్నికి వినిపిస్తాడ‌ట‌. ఒక‌వేళ ఆ స్క్రిప్టు న‌చ్చితే వెంట‌నే సెట్స్‌ కెళ్లిపోవాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్నాడ‌ని కొత్త ప్ర‌చారం ఊపందుకుంది. అయితే `అర‌వింద స‌మేత` రిజ‌ల్ట్‌పైనే ఈ కాంబినేష‌న్ మూవీ ఆధార‌ప‌డి ఉంటుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌స్తుతానికి ఈ స‌స్పెన్స్ ఇలానే కొన‌సాగ‌నుంది. స్టైలిష్‌ స్టార్ అభిమానులు ఇంకాస్త ఓపిగ్గా వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News