మ‌ళ్లీ బాహుబ‌లి అవంతిక‌లా మెరుస్తుందా?

మంచు విష్ణు త‌న భారీ పాన్ ఇండియా చిత్రం క‌న్న‌ప్ప‌లో త‌మ‌న్నా కోసం ఒక స్పెష‌ల్ రోల్ ఇచ్చార‌నేది గుస‌గుస‌.

Update: 2024-04-30 04:49 GMT

కొన్నేళ్ల క్రితం 'బాహుబ‌లి' రిలీజైంది. భార‌తీయ సినిమా ద‌శ దిశ‌ను మార్చిన చిత్ర‌మిది. ఇందులో మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా అవంతికగా న‌టించి మెప్పించింది. ఈ పాత్ర గురించి చాలా చ‌ర్చ సాగింది. ప్ర‌భాస్ శివుడి పాత్ర అవంతిక‌ను అమితంగా ప్రేమిస్తుంది. త‌న ప్రేయ‌సి కోసం చాలా సాహ‌సాలు చేస్తాడు శివుడు. ఒక రొమాంటిక్ సాంగ్ లో త‌న‌తో అద్భుతంగా రొమాన్స్ చేస్తాడు. అలాగే మంచు కొండ‌ల్లో భారీ పోరాట దృశ్యాల్లో, కొన్నిసార్లు బంధిపోట్ల గుంపులో వీర‌నారిగా క‌నిపిస్తుంది. క‌త్తి పోరాటాలు కూడా చేసింది త‌మ‌న్నా.

అయితే ఇంత చేసినా కానీ త‌మ‌న్నా పాత్ర‌కు స‌రైన గుర్తింపు రాలేదు. ఆ పాత్ర‌ను తీవ్రంగా విమ‌ర్శించారు. త‌మ‌న్నా పాత్ర ప‌రిమితంగానే ఉంద‌ని కొంద‌రు క్రిటిక్స్ విమ‌ర్శించ‌గా, ముంబైకి చెందిన ఒక ప్ర‌ముఖ క్రిటిక్.. త‌మ‌న్నా పాత్ర రే*కి గురైంద‌ని కూడా విమ‌ర్శిస్తూ క‌థ‌నాలు రాయ‌డం హాట్ టాపిక్ అయింది.

అదంతా గ‌తం అనుకుంటే వ‌ర్త‌మానంలో త‌మ‌న్నా మ‌రోసారి త‌నకు మంచి పేరు తెచ్చే పాత్ర‌లో క‌నిపిస్తుందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు త‌న భారీ పాన్ ఇండియా చిత్రం క‌న్న‌ప్ప‌లో త‌మ‌న్నా కోసం ఒక స్పెష‌ల్ రోల్ ఇచ్చార‌నేది గుస‌గుస‌.

Read more!

కన్నప్పలో తమన్నా స్పెషల్ గా క‌నిపిస్తుంద‌ని కూడా చెబుతున్నారు. నిజానికి భారీ బ‌డ్జెట్ చిత్రం క‌న్న‌ప్ప‌పై భారీ బ‌జ్ ఉంది. నిర్మాత‌గా రాజీ అన్న‌దే లేకుండా నిర్మిస్తున్నారు మంచు విష్ణు. ఈ సినిమాతో ఘ‌న‌విజ‌యం అందుకునేందుకు ఏ ఒక్క చిన్న అవ‌కాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా పాన్-ఇండియాలో స‌త్తా చాటాల‌ని క‌ల‌లుకంటున్నాడు. ఇందులో ప్రతిభావంతురాలైన కథానాయిక తమన్నా ఒక ప్రత్యేక గీతంలో క‌నిపించే వీలుంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది.

అయితే జైల‌ర్ త‌ర‌హాలో కేవ‌లం ప్ర‌త్యేక గీతానికే ప‌రిమిత‌మవుతుందా? లేక పాట‌తో పాటు న‌ట‌న‌కు స్కోప్ ఉన్న సీన్స్ లో క‌నిపిస్తుందా? అన్న‌దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో డార్లింగ్ ప్ర‌భాస్ ఒక కీల‌క పాత్ర‌ను పోషిస్తుండ‌గా, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఒక ఆదివాసీ తెగతో ముడిపడి ఉన్న పాత్రలో న‌టిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ఒక అతిథి పాత్రలో క‌నిపిస్తార‌ని టాక్ వినిపించింది. కన్నప్ప భారీత‌నం నిండిన‌ ఒక సినిమా మహోత్సవం. ఈ సినిమాపై రోజు రోజుకు అంచ‌నాలు పెరుగుతూనే ఉన్నాయి.

Tags:    

Similar News