గురూజీకి 6 నెలల టార్గెట్..?

గుంటూరు కారం తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తోనే అని దాదాపు ఫిక్స్ అయినట్టే

Update: 2024-04-30 03:44 GMT

గుంటూరు కారం తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తోనే అని దాదాపు ఫిక్స్ అయినట్టే. పుష్ప 2 ఆగష్టులో రిలీజ్ అవ్వగానే పది ఇరవై రోజుల గ్యాప్ తోనే త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. గురూజీతో హ్యాట్రిక్ సినిమాలు హ్యాట్రిక్ హిట్లు చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయనతో మింగిల్ అవ్వడం అంత పెద్ద కష్టమైన పనేమి కాదు. అందుకే పుష్ప 2 రిలీజ్ టైం కల్లా బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయితే పుష్ప 2 రిలీజ్ తర్వాత సెట్స్ మీదకు వెళ్లడమే అనేలా ఉన్నాడు అల్లు అర్జున్.

త్రివిక్రం తో సినిమాను కేవలం 6 నెలల్లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. గురూజీ ఎంత భారీ సినిమా చేసినా షూటింగ్ టైం 6 నెలలు మించి ఉండదు. ఒకవేళ కావాలని గ్యాప్ తీసుకుంటే లేట్ అవుతుంది తప్ప త్రివిక్రం అనుకున్న టైం కు సినిమాను పూర్తి చేస్తాడు. గుంటూరు కారం సినిమా అనుకోని కారణాల వల్ల రెండేళ్లు తీయాల్సి వచ్చింది కానీ ఆ సినిమా ఏడాదిలోపే పూర్తి చేసి రిలీజ్ చేయాల్సింది.

త్రివిక్రం సినిమాకు అల్లు అర్జున్ కేవలం 6 నెలలు టైం కేటాయిస్తాడని టాక్. అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సినిమా మొదలైతే 2025 మార్చి కల్లా సినిమా తన పోర్షన్ పూర్తి చేసేలా చూస్తున్నాడట. అల్లు అర్జున్ పోర్షన్ పూర్తి చేసి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ రిలీజ్ విషయంపై టైం తీసుకున్నా పర్లేదు అంటున్నాడట.

Read more!

త్రివిక్రం సినిమా అనుకున్న విధంగా 6 నెలల్లో పూర్తి చేసి ఆ తర్వాత నెక్స్ట్ సమ్మర్ నుంచి అట్లీ సినిమాకు డేట్స్ ఇవ్వాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. అట్లీ తో పాటుగా సందీప్ రెడ్డి కూడా బన్నీ కోసం ఎదురుచూస్తున్నాడు. అతను కూడా ప్రభాస్ తో స్పిరిట్ చేసిన అనంతరం అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. సో త్రివిక్రం సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్లానింగ్ భారీగానే ఉందని తెలుస్తుంది. త్రివిక్రం సినిమాను కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉండేలానే చేస్తున్నారట. అయితే నేషనల్ లెవెల్ రిలీజ్ చేసినా త్రివిక్రం మార్క్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ తోనే వీరు వస్తారని తెలుస్తుంది. గురూజీతో సినిమా అనగానే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా పుష్ప 2 తో కూడా అల్లు అర్జున్ సూపర్ హిట్ కొడుతున్నాడు అంతే అని హంగామా చేస్తున్నారు.

Tags:    

Similar News