• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్‌ హీరోల వెంట...

స్టార్‌ హీరోల వెంట పడుతున్న రాజమౌళి తండ్రి

By - Tupaki Desk
Update: 2022-08-15 00:30 GMT
ఇండియాస్ టాప్ డైరెక్టర్ రాజమౌళి సక్సెస్ ల వెనుక ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్‌ పాత్ర చాలా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి ప్రతి సినిమా కు కూడా విజయేంద్ర ప్రసాద్ కథలను అందించాడు. కేవలం జక్కన్న సినిమాలకు మాత్రమే కాకుండా బాలీవుడ్ తో పాటు ఇతర భాషల సినిమాలకు కూడా కథలను అందించి పాన్ ఇండియా రైటర్ గా పేరు దక్కించుకున్నాడు.

రచయితలు దర్శకులుగా మారడం చాలా కామన్‌ విషయం. ఇండస్ట్రీలో త్రివిక్రమ్‌ మొదలుకుని కొరటాల శివ వరకు ఎంతో మంది రచయితలు దర్శకులుగా మారి సక్సెస్ అయ్యారు. కొందరు రెండు మూడు సినిమాలకే కనుమరుగు అయ్యారు. విజయేంద్ర ప్రసాద్‌ కూడా దర్శకుడిగా సినిమా లు చేశాడు కాని సక్సెస్ కాలేక పోయాడు.

విజయేంద్ర ప్రసాద్‌ రాజన్న మరియు శ్రీవల్లి సినిమాలను చేశాడు. రాజన్న సినిమా కాస్త పర్వాలేదు అనిపించినా కూడా శ్రీవల్లి సినిమా ఇలా వచ్చి అలా వెళ్లి పోయింది. కనీసం జనాల్లో ఆ సినిమా గురించి పెద్దగా చర్చ కూడా జరగలేదు. కమర్షియల్‌ గా ఇప్పటి వరకు సక్సెస్ కాలేక పోయిన విజయేంద్ర ప్రసాద్‌ మరో ప్రయత్నం చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఆ మధ్య దర్శకత్వం పై ఆసక్తి లేదంటూ చెప్పుకొచ్చిన విజయేంద్ర ప్రసాద్‌ మరో ప్రయత్నం కు సిద్ధం అవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే కథ ను రెడీ చేసుకున్న విజయేంద్ర ప్రసాద్‌ ఆ కథను ఇప్పటికే ఇద్దరు ముగ్గురు స్టార్స్ కు వినిపించాడట. ఈసారి స్టార్‌ హీరోతో సినిమా చేయాలని విజయేంద్ర ప్రసాద్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

రచయితగా సక్సెస్ అయిన విజయేంద్ర ప్రసాద్‌ ఇప్పటి వరకు దర్శకుడిగా సక్సెస్ అవ్వలేక పోయాడు. అందుకే ఏ స్టార్‌ హీరో కూడా విజయేంద్ర ప్రసాద్‌ తో సినిమా ను చేసేందుకు సాహసించడం లేదు. దర్శకుడిగా విజయేంద్ర ప్రసాద్‌ కి ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి ఏ స్టార్‌ హీరో ముందుకు వస్తాడు అనేది చూడాలి.
Tags:    
  • TollywoodFilmMaker 
  • SSRajamouliFather 
  • VijayendraPrasad 
  • FilmIndustry 
  • TollywoodFilms 
  • RajannaFilm 
  • SrivalliMovie 
  • Trivikram 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS