ఎక్సక్లూజివ్:హాలీవుడ్‌ రీమేక్‌ లో విజయశాంతి

Update: 2016-05-10 11:30 GMT
సినిమాల్లోంచి విజయశాంతి పాలిటిక్స్ లోకి ఎప్పుడో ఇంట్రో ఇచ్చేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోవడంతో రాజకీయంగా సైలెంట్ అయిన ఆమె.. ఇప్పుడు సినీరంగంలో రీఎంట్రీ ఇస్తుండడం ఖాయమైంది. ఇంత గ్యాప్ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టడానికి కారణం ఏంటని చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడదే విషయాన్ని మీకు ఎక్స్ క్లూజివ్ గా అందిస్తోంది 'తుపాకి'.

సినిమా రంగంలో ఉన్న సమయంలో లేడీ అమితాబ్ గా పిలిపించుకున్న విజయశాంతి.. ఇప్పుడు కూడా ఆ రేంజ్ కేరక్టర్ తోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అవగా.. డైలాగ్ వెర్షన్ రాయించే పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ మూవీని విజయశాంతి భర్త.. శ్రీనివాస్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఇంతకీ విజయశాంతి చేయనున్న రోల్ ఏంటో తెలుసా.. ఓ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్. హాలీవుడ్ లో డెమీ మూర్ నటించిన 'జీఐ జేన్' చిత్రాన్ని రీమేక్ చేయనున్నారట విజయశాంతి. ఓ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫసర్ గా... సైన్యంలోను, రాజకీయాల్లోను మహిళలను చిన్నచూపు చూడ్డం అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ సాగుతుంది.

ఈ సినిమా చేయడం విజయశాంతికి రాజకీయంగా కూడా ప్లస్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే జీఐ జేన్ సబ్జెక్ట్ నే చేయాలని నిర్ణయించారు విజయశాంతి. ఈ ఏడాది దసరానాటికి సినిమా స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది ఉగాదికి విడుదల చేయాలన్నది ఆలోచన. అయితే.. ఆర్మీ ఆఫీసర్ గా కనిపించేందుకుగాను కఠినమైన ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు విజయశాంతి. అంటే విజయశాంతి రేంజ్ కి తగ్గట్లు మళ్లీ ఆమె చేసే స్టంట్స్ చూడచ్చన్న మాట.
Tags:    

Similar News