• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనీల్ మ‌రో ప‌దేళ్లు...

అనీల్ మ‌రో ప‌దేళ్లు ఏలేస్తాడు!- విజ‌య‌శాంతి

By - Tupaki Desk
Update: 2020-01-02 06:12 GMT
ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి పేరు ఇప్పుడు ఇంటా బ‌య‌టా హాట్ టాపిక్. రాజ‌మౌళి- కొర‌టాల శివ త‌ర్వాత అప‌జ‌య‌మెర‌గ‌ని ద‌ర్శ‌కుడిగా రావిపూడి పేరు మార్మోగుతోంది. క‌మ‌ర్శియ‌ల్ సినిమాల‌కు ప‌ర్ పెక్ట్ ఛాయిస్ అన్న న‌మ్మ‌కాన్ని అత‌డు అగ్ర హీరోల్లో క‌ల్పించాడు. అందుకే సూప‌ర్ స్టార్ మ‌హేష్ పిలిచి మ‌రీ స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రానికి ప‌ని చేసే అవ‌కాశం ఇచ్చారు. ఈ సినిమా విజ‌యం సాధిస్తే అనీల్ కెరీర్ కు ఎదురే లేదని విశ్లేష‌కులు సైతం అంచ‌నా వేస్తున్నారు. రిలీజ్ కాకుండానే అనీల్ తో సినిమా చేయాల‌ని  కొంద‌రు స్టార్ హీరోలు రెడీగా ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

ఈ నేప‌థ్యం లో తాజాగా స‌రిలేరు నీకెవ్వ‌రు ప్ర‌చారం లో భాగంగా లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి అనీల్ ట్యాలెంట్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. అనీల్ వెరీ ట్యాలెంటెడ్. అస్స‌లు టెన్ష‌న్ ప‌డ‌డు. అనీల్ తో షూటింగ్ అంటే సెట్ లో పండ‌గ‌లా ఉంటుంది. స‌రిలేరు షూటింగ్ అప్పుడే అయిపోయిందా? అన్న ఫీలింగ్ క‌లిగింది. ఒక్కో సినిమాకు ఒక్కో త‌ర‌హా స్క్రిప్ట్ ను అత‌డు ఎంచుకుంటాడు. స‌రిలేరు ఇత‌ర సినిమాల‌ తో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటుంది. నేను చెబితే అతి అవుతుందేమో కానీ... ఆ విష‌యం స‌రిలేరు చూసిన త‌ర్వాత మీ అందిర‌కీ అర్ధ‌మ‌వుతుంది. అనీల్ కు మంచి భ‌విష్య‌త్ ఉంది. పంచ్ డైలాగులు భ‌లేగా రాస్తాడు. మ‌రో ప‌దేళ్ల పాటు టాలీవుడ్ ని ఎల్తాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదని లేడీ సూపర్‌ స్టార్ విజ‌య‌శాంతి ప్ర‌శంస‌లు కురిపించారు.

సాక్షాత్తు విజ‌య‌శాంతి లాంటి సీనియ‌ర్ న‌టి అనీల్ గురించి ఇంత గొప్ప‌గా చెప్పారంటే సినిమాలో విష‌యం చాలానే ఉండి ఉంటుంద‌ని అభిమానుల్లో అంచ‌నాలు రెట్టింపవుతున్నాయి. ఇక అనీల్ గురించి మ‌హేష్ ఏమంటరో చూడాలి. ఆయ‌న ఇంట‌ర్వూ కోసం.. జ‌న‌వ‌రి 5న జ‌రిగే ప్రీ రిలీజ్ కోసం ప్రేక్ష‌కులు స‌హా ఫిల్మ్ మీడియా ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. సంక్రాంతి కానుక‌గా స‌రిలేరు నీకెవ్వ‌రు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని అనీల్ సుంక‌ర‌-దిల్ రాజు సంయుక్తం గా నిర్మిస్తున్నారు.
Tags:    
  • Sarileru Neekevvaru 
  • Mahesh Babu 
  • Tollywood 
  • Kollywood 
  • Tollywood Latest Updates 
  • Tollywood Latest News 
  • Telugu Movie News 
  • Anil Ravi Pudi 
  • Tupaki News 
  • Vijaya Shanthi 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS