ఆ పవర్ స్టార్ కూడా దెబ్బేసినట్లే

Update: 2016-04-15 17:30 GMT
తమిళ పవర్ స్టార్ విజయ్ హీరోగా తెరి మూవీ రిలీజ్ అయింది. తెలుగులో పోలీస్ టైటిల్ పై వచ్చింది ఈ చిత్రం. తమిళ ఉగాది సందర్భంగా విడుదలైన ఈ సినిమాపై అంచనాలు చాలానే ఉన్నా.. వాటిని అందుకోవడంలో మాత్రం తెరి విఫలమైంది.

మొదటి రోజున తమిళనాట ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు 13 కోట్లు. ఇది ఆల్ టైం స్టేట్ రికార్డ్ అంటున్నారు. అయితే.. అంచనాలకు తగ్గ మొత్తం మాత్రం కాదు. తెలుగు వెర్షన్ లెక్క ఇంకా తేలలేదు కానీ.. ఇప్పటికే తెరిపై డివైడ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా వీకెండ్ వరకూ కలెక్షన్స్ బాగానే ఉన్నా ఆ తర్వాత నిలబడ్డం కష్టమే అంటున్నారు ట్రేడ్ జనాలు.

టాలీవుడ్ పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ తో నిరుత్సాహపరిస్తే.. కోలీవుడ్ పవర్ స్టార్ తెరితో డిజప్పాయింట్ చేశాడని అంటున్నారు. రివ్యూలు - రేటింగులు కూడా నెగిటివ్ గానే ఉండడంతో.. ఇక తెరిపై హోప్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదనే టాక్ ఉంది. విజయ్ గత చిత్రం పులి డిజాస్టర్ కాగా.. ఇప్పుడు తెరి మరీ అంత కాకపోయినా.. ఫ్లాప్ మూవీగానే మిగలచ్చంటున్నారు.


Tags:    

Similar News