త్రిషపై జోకు పేల్చి అడ్డంగా బుక్కైన న‌టుడు!

కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ చుట్టు వివాదాలు అలుముకుంటున్న విష‌యం తెలిసిందే.;

Update: 2026-03-08 11:13 GMT

కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ చుట్టు వివాదాలు అలుముకుంటున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న భార్య సంగీత రీసెంట్‌గా విడాకులు కోరుతూ చెంగ‌ల్‌ప‌ట్టు జిల్లా ఫ్యామిలీ కోర్టుని ఆశ్ర‌యించి పిటీష‌న్ దాఖ‌లు చేయ‌డం, ఆ వెంట‌నే ఈ కేసు విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు త‌న‌ని అత‌ని నివాసంలోనే కొన‌సాగేలా అనుమ‌తించాల‌ని మ‌రో పిటీష‌న్ వేయ‌డంతో దేశ వ్యాప్తంగా విజ‌య్ విడాకుల వ్య‌వ‌హారం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవ‌ల చెన్నైలో జ‌రిగిన ఓ వివాహ రిసెప్ష‌న‌లో విజ‌య్ తో క‌లిసి త్రిష క‌నిపించ‌డంతో సోష‌ల్ మీడియా ఒక్క‌సారిగా భ‌గ్గుమంది.

ఇద్ద‌రు క‌లిసి వివాహ రిసెప్ష‌న్‌ల‌కు హాజ‌ర‌వుతున్నార‌ని, త్రిష‌, విజ‌య్‌ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న వేళ ఇలా ఇద్ద‌రు వెడ్డింగ్ రిసెప్ష‌న్‌లో పాల్గొని రూమ‌ర్‌ల‌కు బ‌లాన్ని చేకూర్చార‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో న‌టుడు పార్తిబ‌న్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత ఆజ్యం పోస్తున్నాయి. చెన్నైలో జ‌రిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న పార్తీబ‌న్ తన‌తో క‌లిసి వ‌ర్క్ చేసిన న‌టీన‌టులు గురించి చెప్ప‌మ‌ని యాంక‌ర్ అడిగిన‌ప్పుడు పొన్నియిన్ సెల్వ‌న్‌`లో న‌టించిన త్రిష కుంద‌వాయి క్యారెక్ట్ చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా త్రిష గురించి మాట్లాడుతూ పార్తీబ‌న్ `కుంద‌వాయిని ఇంటిలోనే కూర్చోబెట్ట‌డం మంచిది. ఇది చాలా స‌మ‌స్య‌ల‌ని సృష్టిస్తోంది. కాబ‌ట్టి ఆమె బ‌య‌ట అడుగు పెట్ట‌క‌పోవ‌డ‌మే మంచిది` అన్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. స‌ర‌దాగా త్రిష‌పై పార్టీబ‌న్ పేల్చిన జోక్ ఇప్పుడు బ్యాక్ ఫైర్ అయి ఆయ‌న అడ్డంగా బుక్క‌య్యారు. కొంత మంది అభిమానులు ఆయ‌న స‌ర‌దాగా కామెంట్ చేశార‌ని స‌పోర్ట్ చేస్తుంటే ఇండ‌స్ట్రీకి చెందిన సీనియ‌ర్ న‌టుడు, డైరెక్ట‌ర్ అయిన పార్తీబ‌న్ ఇలా వ్యాఖ్యానించ‌డం ఏమీ బాగాలేద‌ని, ఆయ‌న స్థాయికిది త‌గ‌ద‌ని కొంత మంది కామెంట్ చేస్తున్నారు.

విజ‌య్‌, త్రిష‌ల‌పై వ‌స్తున్న వార్త‌ల‌కు పార్టీబ‌న్ చేసిన కామెంట్ మ‌రింత బ‌ల‌ప‌రుస్తోంద‌ని, నెట్టింట పెద్ద ర‌చ్చ‌కు తెర‌లైపింద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు వాపోతున్నారు. మ‌రి కొంత మంది నెటిజ‌న్‌లు పార్టీబ‌న్ చేసిన కామెంట్‌కు సంబంధించిన వీడియోని కోలీవుడ్ ఫైర్ బ్రాండ్స్ ఖుష్బూ, క‌స్తూరి, రాధిక శ‌ర‌త్‌కుమార్‌ల‌కు ట్యాగ్ చేస్తున్నారు. పేరున్న న‌టుడు ఇలా ప‌బ్లిక్ ఫంక్ష‌న్‌ల‌లో స్పందించ‌డం ఏమీ బాగాలేద‌ని, అస‌లు ఇలాంటి వారిని ఫంక్ష‌న్‌ల‌కు నిర్వాహ‌కులు ఎలా ఆహ్వానించార‌ని ఫైర్ అవుతున్నారు.

త్రిష‌పై పార్టీబ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మార‌డంతో అత్య‌ధిక శాతం నెటిజ‌న్‌లు ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు త‌ప్పుబ‌డుతూ ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని అర్థం చేసుకుని ఆయ‌న ఇలాంటి వ్యాఖ్య‌లు చేయాల్సింది కాద‌ని, ఈ మాత్రం ఆయ‌న‌కు తెలియ‌దా? అని కొంత మంది కోలీవుడ్ వ‌ర్గాలు, స‌గ‌టు విజ‌య్ అభిమానులు మండిప‌డుతున్నారు.

Tags:    

Similar News