సంక్రాంతి పోస్టర్ లో కొత్తదనం ఏది దేవరకొండా?

Update: 2020-01-15 10:12 GMT
యువహీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సరిగ్గా నెలలోపే ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి.  సంక్రాంతి సందర్భంగా ఈ రోజు ఒక కొత్త పోస్టర్ విడుదల చేశారు.  

ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ షర్టు.. బనియన్ లేకుండా గడ్డంతో.. పొడవాటి జుట్టుతో రఫ్ గా కనిపిస్తున్నాడు.. నేపథ్యంలో హీరోయిన్లతో రొమాంటిక్ గా ఉండే సన్నివేశాలు ఉన్నాయి.  సినిమాలో నలుగురు హీరోయిన్లు ఎందుకున్నారు.. కథ ఏంటి అనేది ఇంకా తెలియదు. విజయ్ గెటప్ చూస్తుంటే 'అర్జున్ రెడ్డి' ఛాయలు కూడా కనిపిస్తున్నాయి. సినిమా రిలీజ్ అయితే కానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించవు.  ఈ పోస్టర్ లో లుక్ తేడాగానే ఉంది.  'అర్జున్ రెడ్డి'.. 'డియర్ కామ్రేడ్'.. లాంటి సినిమాలలో ఈ గెటప్ ఆల్రెడీ చూసి ఉండడంతో కొంచెం కూడా కొత్తదనం కనిపించడం లేదు. పోస్టర్ చూస్తుంటే 'అర్జున్ రెడ్డి' గుర్తుకు వచ్చేలా ఉంది.  విజయ్ ఇకనైనా 'అర్జున్ రెడ్డి' హ్యాంగోవర్ నుంచి బయటకు రావాలని ఈ పోస్టర్ పై సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో విజయ్ సరసన రాశి ఖన్నా.. ఐశ్వర్య రాజేష్.. కాథరిన్ ట్రెసా.. ఇజబెల్ లీట్ నటిస్తున్నారు. అభిరుచిగల చిత్రాలు తెరకెక్కిస్తాడని పేరున్న క్రాంతి మాధవ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె ఎ వల్లభ నిర్మిస్తున్నారు.  కె యస్ రామారావు ఈ సినిమాకు సమర్పకులు.
Tags:    

Similar News