గోవిందం వద్దనుకున్నా: విజయ్

Update: 2018-08-18 05:45 GMT
టాలీవుడ్ అంతా గోవింద నామస్మరణ జరుగుతోంది. శనివారం కాబట్టి.. అని మీరనుకుంటే పొరపాటే. అన్నీ వారాలు గోవింద నామస్మరణే.. 'గీత గోవిందం' నామస్మరణే! మరి ఇలాంటి గోవిందాన్ని మన విజయ్ భయ్యా రిజెక్ట్  చేద్దామని అనుకున్నాడట. అసలే రౌడీగారు కదా.. ఈ సాఫ్ట్ లెక్చరర్ పాత్ర నాకెందుకు అనుకున్నాడో ఏంటో!

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఎందుకు నో చెప్పాలని అనుకున్నాడో.. నో చెప్పలేక ఎందుకు యస్ చెప్పాల్సి వచ్చింది వెల్లడించాడు. తనకు అప్పటికే చేతినిండా సినిమాలతో ఖాళీ లేదట. అలాంటి సమయంలో స్క్రిప్ట్ వినే ముందే 'నో' చెప్పాలి అనుకుని ఆ తర్వాత విన్నాడట.  ఎందుకంటే డేట్స్ ను కేటాయించడం కష్టం అవుతుంది కాబట్టి. కానీ పరశురామ్ కథ మొదటి సారి చెప్పినప్పుడు ఒక జోక్ కి నవ్వాడట. ఆ తర్వాత రెండో సారి కథ చెప్తే మళ్ళీ అదే జోక్ విని నవ్వాడట. దీంతో కథలో విషయం ఉంది.. వదులుకోకూడదు అని డిసైడయ్యాడట. 

కథ లో నీతి ఏంటంటే విజయ్ భయ్యాకు రెండు సార్లు కథ చెప్తే ఒప్పించే అవకాశం ఎక్కువ ఉంటుంది!  కథ-నీతి అంటే గీత గోవిందం కథ అనుకునేరు! అర్థం అయ్యేవాళ్ళకు చక్కగా అర్థం అయ్యే ఉంటుంది.. స్మార్ట్ ఫోన్ - సోషల్ మీడియా - ఇన్స్టా గ్రామ్ జనరేషన్ కదా..  ఏదైనా ఇట్టే పట్టేస్తారు.
Tags:    

Similar News