విజయ్ అలా రికార్డ్ సృష్టించాడు!

Update: 2018-08-28 16:53 GMT
విజయ్ దేవరకొండ కు ఒనిడా టీవీ కి కాస్త ఇంట్రెస్టింగ్ పోలిక ఉంది.  ఆ టీవీ పెరెప్పుడూ వినలేదని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఓ ఇరవై ఏళ్ల క్రితం ఒనిడా అనే 'ఇప్పుడు అవుట్ డేట్ అయిన అప్పటి హాట్' టీవీ యాడ్ లో క్యాప్షన్ 'నెయిబర్స్ ఎన్వీ ఓనర్స్ ప్రైడ్'.. అంటే పక్కనోడు  కుళ్ళుకొని చస్తాడు గానీ ఓనర్ కి సమ్మగా ఉంటుంది.  ఇప్పుడు 'గీత గోవిందం' సినిమా రిలీజ్ తర్వాత విజయ్ డేట్స్ ఉన్న నిర్మాతలు - దర్శకులు.. లైన్ లో ఉన్న వారు అందరూ ఒనిడా టీవీ ఓనర్స్ లాంటోళ్ళు!

'అర్జున్ రెడ్డి' ఫ్లూక్ అని, అసలు క్రెడిట్ సందీప్ వంగాదే అని కొంతమంది తీర్మానించిన వారు కూడా ఉన్నారు.  విజయ్ యాక్టింగ్ ను మెచ్చుకున్నారు గానీ విజయ్ నటన కంటే ఎక్కువగా సినిమాకు హోల్ సేల్ గా ప్రశంసలు లభించడం తో విజయ్ ను తక్కువ అంచనా వేసినవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ 'గీత గోవిందం' వాళ్ళకే కాదు..  టాలీవుడ్ ల్లో సెకండ్ లీగ్ లో ఉన్న స్టార్స్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక నిజ్జంగా నిజం మాట్లాడుకుంటే ఆ ప్రకంపనాలు పెద్ద స్టార్స్ కూడా ఫీలయ్యి ఉంటారు!

మరి ఇంత భూకంపం తీసుకొచ్చిన దేవరకొండకు రెమ్యూనరేషన్ పెరగకుండా ఉంటుందా? అసలే ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తక్కువ.. అలాంటి చోట విజయ్ పేరు చెప్తే ఫుల్ ప్రాఫిట్ లో బిజినెస్ అవుతోంది.  సినిమా రిలీజ్ కు ముందే హోల్ సెల్ గా అమ్ముకున్నా భారీ లాభాలతో బయట పడొచ్చు. దీంతో ఆల్రెడీ మైత్రీ మూవీ మేకర్స్ వారు విజయ్ రెమ్యూనరేషన్ ను రూ. 3 కోట్ల నుండి రూ. 8 కోట్లకు సవరించారట.  వాళ్ళు అగ్రిమెంట్ ప్రకారం మూడు కొట్లిచ్చినా ఓకె కానీ వాళ్ళు అలా చేయదలుచుకోలేదట. సో.. మిడ్ రేంజ్ స్టార్ హీరోల్లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ విజయ్ దేవరకొండదే.. ఇప్పుడు రౌడీ హీరో కు ఇది మరో రికార్డ్ ఎందుకంటే మిడ్ రేంజ్ లో టాప్ లో ఉన్న హీరో నాని రెమ్యునరేషన్ ఇప్పుడు రూ. 6 కోట్లు మాత్రమే.

ఈ లెక్కన ఇంకో రెండు సాలిడ్ హిట్లు కొడితే.. టాప్ లీగ్ హీరోలకు ఎసరు పెట్టినా మనం ఆశ్చర్యపడాల్సిన పని  లేదు.  ఈ లాజిక్ ను ఎలా వివరించాలి?  ఇండస్ట్రీ పెద్దలు అదేపనిగా పప్పులను ప్రేక్షకులపై రుద్దుతూ ఉంటే కష్టపడి పైకొచ్చిన హీరోకు ప్రేక్షకులు ఫ్రస్ట్రేషన్ తో ఇచ్చిన గుర్తింపు అనుకోవచ్చేమో!


Tags:    

Similar News