`పాన్ ఇండియా` అంటూ పాకులాడే హీరోలకు కళ్లు తెరిపించిన రౌడీ
మన హీరోలు హిందీ పరిశ్రమలోనూ ఇమేజ్ పెంచుకుని మార్కెట్ పరంగా క్రేజు తెచ్చుకోవాలని తపిస్తున్న సంగతి తెలిసినదే. ప్రభాస్ రానా తర్వాత పలువురు హీరోలు అదే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో విజయ్ దేవరకొండ పేరు ప్రముఖంగా వినిపించింది. గత కొంతకాలంగా పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేసిన రౌడీ గారు గట్టి పట్టు పట్టే పనిలోనే ఉన్నారని ప్రూవైంది.
ముఖ్యంగా పూరితో కలిసి ఫైటర్ మూవీ కోసం అతడు కరణ్ జోహార్ నే రింగులోకి లాగాడు. ఆ తెలివితేటలకు ఔరా! అంటూ అంతా అబ్బురపడిపోయారు. ఎంతో తెలివిగా విజయ్ దేవరకొండ తన మార్కెట్ పరిధిని పెంచుకునే ప్రయత్నం చేస్తుండడం హీటెక్కించింది. ఆ క్రమంలోనే తెలుగు-హిందీ-తమిళం సహా పలు భాషల్లో రిలీజవుతుందని ఫైటర్ గురించి ప్రచారం సాగిపోయింది.
ఇక ఇదే చిత్రంతో రౌడీ గారు బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారని అభిమానులు భావించారు. కానీ దేవరకొండ వెర్షన్ మాత్రం వేరొకలా ఉంది. అసలు బాలీవుడ్ అనేది సపరేట్ కాదు. అది మనలో భాగమే అనేశాడు. అంటే మన ఇండస్ట్రీలో మనం నటిస్తే తప్పేంటి అన్నట్టే వినిపించింది సౌండింగ్.
‘ఫైటర్’ హిందీలో తనకు ఆరంభ చిత్రమనుకోవడం లేదని.. అసలు బాలీవుడ్ అనేది ఇండియాలో సపరేట్ పరిశ్రమ అని తాను భావించడం లేదని అనేశాడు.ఇండియాలోని సినీ పరిశ్రమలన్నీ ఒక్కటేనని లాజిక్ తో కొట్టాడు. ఫైటర్ తనకు కిక్కిస్తుందని కూడా అన్నాడు. మొత్తానికి పాన్ ఇండియా అంటూ ప్రయత్నించే ఇతర హీరోలందరికీ కళ్లు తెరిపించినట్టే ఉంది రౌడీ వెర్షన్.