డ్రాగన్.. 1000 కోట్లంటే తప్పదు మరి
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఇప్పుడు పాన్ ఇండియా ట్రాక్ ను దాటి అంతకుమించి అనేలా వెళుతోంది.;
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఇప్పుడు పాన్ ఇండియా ట్రాక్ ను దాటి అంతకుమించి అనేలా వెళుతోంది. ఆర్‌ఆర్ఆర్‌తో వెయ్యి కోట్ల రికార్డు తన ఖాతాలో ఉన్నప్పటికీ, అది మల్టీస్టారర్ కావడంతో సోలోగా ఆ మార్కును అందుకోవాలనేది నందమూరి అభిమానుల చిరకాల కోరిక. మొన్నటి ‘దేవర’తో సోలోగా 500 కోట్ల మార్కును అలవోకగా దాటేసిన తారక్, ఇప్పుడు ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’తో నేరుగా వెయ్యి కోట్ల క్లబ్‌పై కన్నేశారు.
అందుకే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతున్నా తారక్ అస్సలు టెన్షన్ పడటం లేదు. క్వాలిటీ కోసం ఎంత టైమ్ తీసుకున్నా పర్లేదు కానీ, అవుట్‌పుట్ మాత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించాలనేది ఆయన ప్లాన్. సాధారణంగా ఒక సినిమా పట్టాలెక్కి ఏడాది దాటితే హీరోలు అసహనానికి గురవ్వడం సహజం. కానీ ఎన్టీఆర్ స్టైల్ వేరు. ఒక్కసారి దర్శకుడిని నమ్మితే వందకు రెండు వందల శాతం ఎఫర్ట్ పెడతారు.
ప్రశాంత్ నీల్ లాంటి విజనరీ ఉన్న దర్శకుడితో పని చేస్తున్నప్పుడు టైమ్ గురించి ఆలోచించడం కంటే, ఆ పర్ఫెక్షన్‌ను ఎంజాయ్ చేయడమే మిన్న అని తారక్ నమ్ముతున్నారు. నీల్ ప్రతి ఫ్రేమ్‌ను చాలా గ్రాండ్‌గా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో మలుస్తున్నారు. షూటింగ్‌లోనే తారక్ మునుపెన్నడూ చూడని హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను పూర్తి చేశారని సమాచారం. పోటీగా ఎన్ని సినిమాలు లైన్లో ఉన్నా ఎన్టీఆర్ పెద్దగా పట్టించుకోరు. ‘స్పిరిట్’, ‘వారణాసి’ వంటి భారీ చిత్రాలు వస్తున్నప్పటికీ, కంటెంట్‌లో దమ్ముంటే ఆడియన్స్ తన సినిమా విషయంలో అంచనాలు తగ్గవు అని పక్కా క్లారిటీ ఉంది.
కంటెంట్ బాగుంటే ఆ ఎదురుచూపులే సినిమాకు భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెడతాయి. ప్రశాంత్ నీల్ తీసుకుంటున్న ఈ అదనపు సమయం, ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ విజువల్ వండర్‌ను సిద్ధం చేయడానికి ఉపయోగపడుతోంది. ఒక సోలో హీరోగా వెయ్యి కోట్ల మార్క్ అందుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. దానికి తగినట్లుగానే ప్రశాంత్ నీల్ ఈ కథను పాన్ వరల్డ్ స్థాయిలో డిజైన్ చేశారు.
ఇప్పటివరకు షూటింగ్ పూర్తయిన సీన్లు చూసి తారక్ ఫుల్ హ్యాపీగా ఉన్నారని, అందుకే షూటింగ్ ఎంత లేట్ అయినా ఎక్కడా ఒత్తిడి లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారని తెలుస్తోంది. నీల్ మార్క్ ఎలివేషన్లకు ఎన్టీఆర్ నటన తోడైతే, బాక్సాఫీస్ వద్ద ఆ సౌండ్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఆలస్యం వెనుక ఒక పక్కా వ్యూహం ఉంది. భారీ సినిమాల మధ్య క్లాష్ ఉండకూడదని, తన సినిమాకు ఒక సోలో రిలీజ్ విండో ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు.
అందుకే 2027 సెకండ్ హాఫ్ కు వెళ్లినా తారక్ వెనక్కి తగ్గడం లేదు. ఒక మాస్టర్ పీస్ కోసం ఐదేళ్లయినా వెయిట్ చేసిన రాజమౌళి హిస్టరీని తారక్ దగ్గరుండి చూశారు. ఇప్పుడు నీల్ విషయంలోనూ అదే ఫార్ములాను నమ్ముతున్నారు. క్వాలిటీ వస్తే రికార్డులు అవే వస్తాయనేది ఆయన ధీమా. మొత్తానికి ‘డ్రాగన్’ ఆలస్యం అనేది బిగ్ సక్సెస్ కోసమే. సోలోగా వెయ్యి కోట్ల రికార్డును తిరగరాయడానికి ఎన్టీఆర్ తీసుకుంటున్న ఈ రిస్క్ కచ్చితంగా సక్సెస్ అవుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. మరి నీల్ ఆ నమ్మకాన్ని ఏ స్థాయిలో నిలబెట్టుకుంటాడో చూడాలి.