గోవిందం సరే.. టాక్సీవాలా ఎప్పుడు?

Update: 2018-07-18 12:22 GMT
అన్నీ సినిమాలు ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్లకే థియేటర్లలకు రావు.  కొన్ని ఆలస్యం అవుతాయి. మరికొన్ని మరింత అలస్యం అవుతాయి. ఇందులో భారీ బడ్జెట్ సినిమాలు లో-బడ్జెట్ సినిమాలనే తేడాలుండవు.  దీనికి '2.0' నుండి 'టాక్సీవాలా' వరకూ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.  '2.0' కొత్త రిలీజ్ డేట్ ఈమధ్యే ఎనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి, మనం దాన్ని పక్కనబెట్టి విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' గురించి మాట్లాడుకుందాం.

'అర్జున్ రెడ్డి' తర్వాత విజయ్ దేవరకొండ సోలో సినిమా కోసం ఫ్యాన్స్ - సాధారణ ప్రేక్షకులు - ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  విజయ్ అదేదో ఇంటర్వ్యూ లో చెప్పినట్టు 'బ్యాక్ లాగ్' అయిన 'ఏ మంత్రం వేసావే' ను పక్కనబెడితే 'టాక్సీవాలా'.. 'గీత గోవిందం' రెండూ రిలీజ్ కావాల్సిన విజయ్ కొత్త సినిమాలు.  ఈ రెండూ అల్లు అరవింద్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలే.  ఇప్పుడైతే 'గీత గోవిందం' ముందుకొచ్చింది కానీ నిజానికి 'టాక్సీవాలా' మొదటగా రిలీజ్ కావలసిన సినిమా.  మే 18 న రిలీజ్ చేస్తారని డేట్ అనౌన్స్ చేసి - ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు కూడా.  కానీ సరిగ్గా విడుదల పదిరోజులు ఉందనగా - విజయ్ స్వయంగా సినిమాను వాయిదా వేస్తున్నట్టు చెప్పాడు.  జూన్ లో విడుదల అని కూడా చెప్పుకొచ్చాడు.  జూన్ పోయింది.. జూలై కూడా సగానికి పైగా అయిపోయింది కానీ 'టాక్సీవాలా' సంగతి మాత్రం ప్రస్తావించడం లేదు.

ఫిలిం యూనిట్ సభ్యులు వీఎఫెక్స్ పనులవల్ల జాప్యం జరుగుతోందని అంటున్నారు గానీ అది నమ్మశక్యంగా లేదని ఫిలిం నగర్ టాక్. ఎందుకంటే ఎంతమాత్రం వీఎఫెక్స్ అయినా రెండు నెలలపైన సమయం తీసుకునే అవకాశం లేదు... '2.0'  భారీ ప్రాజెక్టుల విషయంలో అది నిజమై ఉండే అవకాశం ఉంది గానీ 'టాక్సీవాలా' ఆ రేంజ్ గ్రాఫిక్స్ అవసరం ఉండదని అంటున్నారు.  సినిమా రషెస్ చూసిన అల్లు అరవింద్ పూర్తిగా సాటిస్ఫై  కాలేదని - అందుకే రీషూట్ కు వెళ్ళమని చెప్పాడని దాంతో సినిమా లేట్ అయిందని అంటున్నారు.  మరి 'టాక్సీవాలా' కు మోక్షమెప్పుడో తెలియాలంటే ప్రేక్షకులు కుడా కొద్దిరోజులు వెయిట్ చెయ్యక తప్పదు.  
Tags:    

Similar News