సూపర్ హిట్ బేనర్లోకి పెళ్లిచూపులు హీరో

Update: 2016-09-28 19:30 GMT
విజయ్ దేవరకొండ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో నటించాడని చాలామందికి తెలియదు. ‘ఎవడే సుబ్రమణ్యం’ బాగానే పేరు తెచ్చింది కానీ.. అతడి పేరు అప్పటికి కూడా ప్రేక్షకుల మనసుల్లో రిజిస్టరవ్వలేదు. ఐతే ‘పెళ్లిచూపులు’ సినిమా రిలీజయ్యాక సీన్ మారిపోయింది. విజయ్ దేవరకొండ వెంటనే జనాల్లోకి వెళ్లిపోయాడు. ఫెమిలియర్ హీరో అయిపోయాడు. ఇప్పుడు సెట్స్ మీద ఉన్న విజయ్ సినిమాలన్నింటిపైనా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ద్వారక.. అర్జున్ రెడ్డి అనే సినిమాలు చేస్తున్న విజయ్.. ఇంకా రెండు మూడు పెద్ద బేనర్లలో అవకాశాలు సంపాదించాడు. అందులో ఒకటి టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటైన యువి క్రియేషన్స్ కావడం విశేషం.

దర్శక నిర్మాత మారుతితో కలిసి యువి క్రియేషన్స్ నిర్మించబోయే సినిమాలో విజయ్ హీరోగా నటించనున్నాడు. ఈ చిత్రాన్ని రాహుల్ అనే కొత్త దర్శకుడు రూపొందించబోతున్నాడు. కొన్ని నెలలుగా మారుతి సహకారంతో అతను స్క్రిప్టు రెడీ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది. యువి క్రియేషన్స్ లో చేశాడంటే విజయ్ కెరీర్ మరో మెట్టు ఎక్కినట్లే. ‘మిర్చి’ దగ్గర్నుంచి ‘ఎక్స్ ప్రెస్ రాజా’ వరకూ ప్రతి సినిమాతోనూ తనదైన ముద్ర వేసింది యువి క్రియేషన్స్. మరోవైపు అశ్వనీదత్ నిర్మాణంలోనూ విజయ్ ఓ సినిమా చేస్తాడని వార్తలొస్తున్నాయి. మొత్తానికి నాని.. శర్వానంద్.. రాజ్ తరుణ్.. లాంటి హీరోల కోవలోకి త్వరలోనే చేరిపోయేట్లున్నాడు విజయ్ దేవరకొండ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News