పిక్ టాక్ : ఏంటి లైగర్ ఈ అవతారం?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రెగ్యులర్ గా ఏదో ఒక షూట్ లో ఉంటూనే ఉంటాడు. లేదా ఏదో ఒక కార్యక్రమానికి హాజరు అవుతూ ఉంటాడు. ప్రస్తుతం థర్డ్ వేవ్ మొదలు అయ్యింది. కరోనా భయంతో మళ్లీ ఎవరికి వారు ఆంక్షలు విధించుకుని ఇంటికే పరిమితం అవుతున్నారు. దాంతో విజయ్ దేవరకొండ కూడా ఇలా షూటింగ్ క్యాన్సిల్ అవ్వడంతో ఇలా చిల్ అవుతున్నట్లుగా ఫొటోను షేర్ చేశాడు. షూటింగ్ మళ్లీ ఎప్పుడు ఏంటి అనేది ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే కరోనా థర్డ్ వేవ్ ఎన్ని రోజులు ఉంటుంది.. ఎంత ప్రభావం ఉంటుంది అనేది తెలియదు. కనుక అన్ని రోజులు కూడా విజయ్ దేవరకొండ ఇలా ఇంటికే పరిమితం అయ్యి హాయిగా తన పెట్ డాగ్స్ తో చిల్ అవుతూ ఉంటాడు.
విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఈ స్టిల్ కు అమ్మాయిలు ఫిదా అవుతుంటే అబ్బాయిలు మాత్రం కుళ్లుకుంటున్నారు.. ఏయ్ రౌడీ ఇలాంటి అవతారం తో నువ్వు ఫొటోలను షేర్ చేస్తే నా పోరి నీవు కావాలంటే నేను ఏం చేసేది అంటూ అబ్బాయిలు కామెంట్స్ చేస్తున్నారు. అబ్బాయిలు సైతం అసూయ పడే అందం అబ్బా నీది అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో మనోడి జోరు మరియు హుషారు అంతా ఇంతా కాదు. ఈ ఫొటోకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ స్థాయిలో ఒక హీరో కు లైక్స్ రావడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.
అమ్మాయిలు.. హీరోయిన్స్ ఫొటోలు షేర్ చేస్తే లక్షల లైక్స్ రావడం కామన్. కాని హీరోయిన్ ఫొటోలు ఎంతో స్పెషల్ గా ఉంటే తప్ప మిలియన్ లైక్స్ రావడం కష్టం. కాని ఒక సింపుల్ చిల్లింగ్ ఫోజ్ తో విజయ్ దేవరకొండ ఏకంగా 12 లక్షల లైక్స్ ను దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. లైగర్ తో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. ఉత్తరాది ముద్దుగుమ్మ అనన్యపాండే ఈ సినిమా తో సౌత్ లో పరిచయం అవ్వబోతుంది. వీరిద్దరి కాంబో రొమాన్స్ సినిమాకు హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో ఒక చాయ్ వాలా అంతర్జాతీయ స్థాయి బాక్సర్ ఎలా అయ్యాడు అనేది చూపించబోతున్నట్లుగా ఇటీవల విడుదల అయిన గ్లిమ్స్ ను బట్టి అర్థం అవుతుంది. సినిమా లో ఇంకేం పూరి చూపిస్తాడా అనేది చూడాలి.