పండుగ స్పెషల్.. రౌడీస్టార్ పది లక్షలు సహాయం!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతీ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఆర్ధికంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. తనకి తోచిన ఆర్ధిక సహాయం చేసి కష్టాల్ని తీర్చడం ఓ బాధ్యతగా తీసుకుంటాడు. తాజాగా ఈ క్రిస్మస్ కి మరో 100 మందికి సహాయం చేయడానికి రెడీ అయ్యాడు. 100 మందికి పదివేలు చొప్పున పదిలక్షలు సహాయం ప్రకటించాడు. క్రిస్మస్.. న్యూ ఇయర్ సందర్భంగా తన తరుపు నుంచి సహాయం చేయబోతున్నట్టు ప్రకటించాడు.
జనవరి 1న 100 మందికి డబ్బులు ఇస్తానని తెలిపాడు. అయితే ఈ సహాయం బాగా అవసరం ఉన్నవారికి మాత్రమే. పండుగ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు.. అర్జెంట్ అవసరాలు ఉన్నవాళ్లు మాత్రమే తీసుకోవాలని రిక్వెస్ట్ చేశాడు విజయ్. దీని కోసం ఓ ఫార్మాట్ ను కూడా ప్రకటించాడు రౌడీ హీరో. సహాయం కావాల్సిన వారు వాళ్ల మెయిల్ ఐడీ నుంచి రౌడీ క్లబ్ లో రిజిస్టర్ కావాలని సూచించాడు. అందరి పేర్లను..వాళ్ల వివరాలను నిశితంగా పరిశీలించి 100 మందిని ఎంపిక చేస్తానని తెలిపాడు.
రౌడీ హీరో నిజంగా గ్రేట్. క్రిస్మస్.. న్యూ ఇయర్.. సంక్రాంతి లాంటి పండుగలను సంతోషంగా జరుపుకోలేని పేదలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో 100 మందిని ఎంపిక చేసి పండుగ పేరుతో వాళ్ల కష్టాల్ని కొంతలో కొంతైనా తీర్చడానికి విజయ్ ప్రయత్నించడం హర్షించదగ్గ విషయం. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `లైగర్` చిత్రంలో నటిస్తున్నాడు. చిత్రీకరణ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా హిట్ అయితే విజయ్ రేంజ్ అంతకంతకు పెరిగిపోతుందనడంలో సందేహం లేదు. విజయ్ తనను తాను పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇది నెరవేరుతుందనే భావిస్తున్నారు.