స్టార్ డైరెక్టర్ తో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేసిన VD....!
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుసగా స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న విజయ్.. తాజాగా స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో మూవీ అనౌన్స్ చేశాడు. 'పుష్ప' పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్ తదుపరి ప్రాజెక్ట్ ఇదేనని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా కేదార్ సెలగం శెట్టి నిర్మిస్తున్నారు. నేడు కేదార్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించాడు విజయ్.
విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ "నాలో ఉన్న నటుడు చాలా ఎగ్జయింట్ గా ఎదురు చూస్తున్నాడు. నాలోని ప్రేక్షకుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. మీ అందరికీ గుర్తుండిపోయే సినిమాను ఇస్తామని గ్యారంటీ ఇస్తున్నాను. సుక్కు సార్ తో సెట్స్ లో ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురు చూస్తున్నాను. హ్యాపీ బర్త్ డే కేదార్. నువ్వు మంచి స్నేహితుడివి. ఎంతో హార్డ్ వర్క్ చేస్తావు" అని పేర్కొన్నాడు. 2022లో ప్రారంభం కానున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కాగా, విజయ్ దేవరకొండ - పూరీ కాంబినేషన్ లో 'ఫైటర్' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనే విషయం తెలిసిందే. ఇప్పటికే 40 డేస్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని కోవిడ్ కారణంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ స్టార్ట్ చేసే ఆలోచన చేస్తున్నారని సమాచారం. పూరీ కనెక్ట్స్ బ్యారర్ ఫై పూరీ - ఛార్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. మరోవైపు సుకుమార్ అల్లు అర్జున్ తో 'పుష్ప' సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసి.. వచ్చే ఏడాది సుక్కు - విజయ్ క్రేజీ కాంబోలో మూవీ స్టార్ట్ కానుంది.