• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నేను మహేశ్ కి పెద్ద...

నేను మహేశ్ కి పెద్ద ఫ్యాన్: విజయ్ దేవరకొండ

By - Tupaki Desk
Update: 2021-11-08 05:38 GMT
తెలుగు తెరపైకి మాంఛి దూకుడు మీద వచ్చిన హీరో విజయ్ దేవరకొండ. కథలను ఎంచుకునే విషయంలోను ఆయన అదే దూకుడు చూపిస్తూ వచ్చాడు .. తన సినిమాల ప్రమోషన్స్ విషయంలోనూ అదే దూకుడు చూపిస్తూ వచ్చాడు. ఆ దూకుడే ఆయనకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. విజయ్ దేవరకొండను చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఏ విషయాన్ని నాన్చడు .. తాను అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళుతుంటాడు.

విజయ్ దేవరకొండ మాటలు విన్నప్పుడు ఆయనలో ఆవేశం మాత్రమే ఉందని అనుకుంటారు. కానీ ఆయన 'రౌడీస్' బ్రాండ్ స్టార్ట్ చేయడం .. సొంత బ్యానర్లో సినిమాలు స్టార్ట్ చేయడం చూస్తే ఆయనకి ముందుచూపుతో కూడిన ఆలోచన కూడా ఉందనే విషయం అర్థమవుతుంది. ఇక పాన్ ఇండియా సినిమా చేయడంలోను ఆయన ఇదే దూకుడును చూపించాడు. కెరియర్ ను ఆరంభించిన చాలా తక్కువ కాలంలోనే ఆయన ఈ రేంజ్ లో ఎదిగాడు. ఆయన బ్యానర్ పై నిర్మితమైన 'పుష్పక విమానం' ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. హాలీవుడ్ స్టార్స్ లో ఆస్కార్ విన్నర్ డెంజెల్ వాషింగ్ టన్ .. మెరీల్ స్ట్రీప్ అంటే తనకి చాలా ఇష్టమని చెప్పాడు. ఇక బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ యాక్టింగ్ ను తాను ఎక్కువగా ఇష్టపడతానని అన్నాడు. టాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరో మహేశ్ బాబు అనీ .. ఆయనకి తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు. ఆయన డైలాగ్ డెలివరీ .. సింపుల్ కనిపిస్తూనే తనదైన స్టైల్ ను చూపించే విషయంలో ఆయన తనకి బాగా నచ్చుతాడని అన్నాడు.

మహేశ్ బాబు .. విజయ్ దేవరకొండ కొన్ని సినిమా ఫంక్షన్స్ లో కలుసుకున్నారు. అప్పుడు వాళ్లిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. విజయ్ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు "ఈ జనరేషన్ లో యూత్ పై ఎక్కువ ప్రభావం చూపిన హీరో విజయ్ దేవరకొండ" అని ఆయన చాలా బోల్డ్ గా చెప్పాడు. ఈ ఇద్దరినీ ఒకే వేదికపై చూసిన అభిమానులు, ఒకే తెరపై చూడాలని కోరుకుంటున్నారు. మరి వాళ్ల ముచ్చట తీరుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం నిర్మాతగా 'పుష్పక విమానం' ప్రమోషన్లో ఉన్న విజయ్ దేవరకొండ, ఈ నెల 12వ తేదీన 'లైగర్' సినిమా షూటింగు కోసం అమెరికా వెళుతున్నాడు.


Tags:    
  • Vijay Devarakonda 
  • PuspakaVimanam 
  • Event 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS