`ఫైటర్` కోసమేనా రౌడీ గారి జులపాల జుత్తు?
తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం కోసం.. అందుకు తగ్గ ఆహార్యాన్ని ప్రెజెంట్ చేసేందుకోసం సాహసాలు చేయడంలో విశ్వనటుడు కమల్ హాసన్ .. సూపర్ స్టార్ రజనీకాంత్.. మెగాస్టార్ చిరంజీవి ఎంతగా హార్డ్ వర్క్ చేస్తారో తెలిసిందే.
వీళ్లందరి స్ఫూర్తితోనే నైజాం మెగాస్టార్ గా పాపులరవుతున్న విజయ్ దేవరకొండ అంతే హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీ ఫైటర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం అతడి మేకోవర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
విజయ్ ఇప్పటికే 6 ప్యాక్ చేస్తున్నాడు. అలాగే పొడవాటి గిరజాల జుత్తు పెంచాడు. ఈ స్టైల్లో రెమోలా కనిపిస్తున్నాడు. పైగా రౌడీ బ్రాండ్ దుస్తుల్లో అదరగొట్టేస్తున్నాడిలా. విజయ్ లేటెస్ట్ ఫోజ్ చూశాక.. జులపాల జుత్తుతో గ్రీకువీరుడిలా దిగాడు! అంటూ అమ్మాయిలంతా కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
ప్రతిసారీ ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ పరంగా విజయ్ ఏదో ఒక కొత్తదనం ట్రై చేస్తూనే ఉన్నాడు. ఈసారి కూడా అదే పంథాలో ఆకర్షిస్తున్నాడు.
విజయ్ తన పొడవాటి జుట్టు తన రాబోయే చిత్రం కోసం పొడవాటి జుట్టును పెంచుతున్నాడనే విషయం ఇప్పుడిలా వైరల్ గా మారుతోంది. ఏపుగా పెరిగిన అపరిశుభ్రమైన జుట్టు వాస్తవానికి అతని చుట్టూ ఏదో తెలీని ప్రత్యేకతను క్రియేట్ చేస్తోంది. ఉత్సుకతను సృష్టిస్తోంది. అయితే అతడు అలా మారడం వెనక అసలు కారకుడు పూరి అనడంలో సందేహమేం లేదు. పాత్ర కోసం హీరోల్ని మార్చేయడంలో అతడు ఘనాపాటి. ఇప్పుడు రౌడీ గారి వంతు అన్నమాట. ‘ఫైటర్’ కోసం అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ ఈ చిత్రం షూటింగ్ లో ఇంకా చేరలేదు. ఈ గ్యాప్ తర్వాత తిరిగి షూటింగ్ ను తిరిగి ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.