4 ఫ్యామిలీస్ రూ.200 ఆదాయంతో

Update: 2015-11-02 11:30 GMT
స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి - స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ - స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి .,. వీళ్లంతా కోట్ల‌లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నార‌ని  మాట్లాడుకుంటాం. కానీ వీళ్లంతా ఒక‌ప్పుడు ఫుడ్డుకి లాట‌రీ టిక్కెట్టు కొట్టిన‌వాళ్లే. ఓ సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చిన‌వాళ్లే అన్న సంగ‌తి చాలా త‌క్కువ‌మందికే తెలుసు. చెన్న‌య్‌ లో కీర‌వాణి తండ్రి - విజ‌యేంద్ర ప్ర‌సాద్ సోద‌రుడు కోడూరి శివ‌శ‌క్తి ద‌త్తా రైట‌ర్‌ గా - పెయింట‌ర్‌ గా, లిరిసిస్టుగా కెరీర్ ప్రారంభించి కుటుంబాన్ని పోషించేవారు.

అయితే అస‌లే పెద్ద ఉమ్మ‌డి ఫ్యామిలీ. ఓ డ‌బుల్ బెడ్‌ రూమ్‌ లో నాలుగు కుటుంబాలు క‌లిసి ఉండేవి. అంత‌మందిని పోషించ‌డం క‌ష్టం అయ్యేది. అయినా శివ‌శ‌క్తి ద‌త్తాని పెద్ద దర్శ‌కుడిని చేయాలన్న ప‌ట్టుద‌ల‌తో ఇంట్లో ఉన్న‌దంతా ఊడ్చిపెట్టేశారు. 1985లో ఓ సినిమా తీశారు. అయితే అది పెద్ద డ్యామేజింగ్ అయ్యింది. ఉన్న‌దంతా ఊస్టింగ్ అయిపోయంది. ఆ టైమ్‌ లో ఫ్యామిలీని పోషించ‌డమే క‌ష్ట‌మ‌య్యేది. అప్ప‌టికి కీర‌వాణి మ్యూజిక్ అసిస్టెంటుగా చేరారు. అత‌డి రోజువారీ ఆర్జ‌న రూ.200. దాంతోనే నాలుగు ఫ్యామిలీలు బ‌తికేవి. విజ‌యేంద్ర ప్ర‌సాద్ అప్ప‌టికి రైట‌ర్ కానేకాదు. కీర‌వాణి రెగ్యుల‌ర్‌ గా కె.రాఘ‌వేంద్ర‌రావుతో క‌లిసి క‌థా చ‌ర్చ‌ల్లో పాల్గొనేవారు. బ్ర‌ద‌ర్‌ కి తోడుగా  విజ‌యేంద్ర ప్ర‌సాద్ వెళుతుండేవారు. అలా రైట‌ర్ అవ్వాల‌న్న త‌ప‌న పెరిగింది. దాంతో క‌థ‌లు రాయ‌డం మొద‌లు పెట్టి నిరంత‌రం అదే ప‌నిలో ఉండేవారు. ఆ త‌ర్వాత అదే కెరీర్ అయ్యింది. అయితే ప‌దేళ్ల పాటు సోలో రైట‌ర్ అవ్వ‌డానికి క‌ష్టించాల్సొచ్చింది. 1994లో మొద‌టిసారి క‌థార‌చ‌యిత‌గా పేరొచ్చింది. నేను రాసే క‌థ‌ల్లో అంద‌మైన అబ‌ద్ధాల్ని కూడా నిజాలుగా చెప్పి ఒప్పించేవాడిని అని అంటారు విజ‌యేంద్రుడు.

ఏదేమైనా ఆరోజు ప్రారంభించిన కెరీర్ ఈరోజు కోటానుకోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించింది. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్స్ వెన‌క ఓ బ‌ల‌మైన శ‌క్తిగా విజ‌యేంద్రుని ఆవిష్క‌రించింది. ఈరోజు విజ‌యేంద్రుడు స్టార్ రైట‌ర్‌. రాజ‌మౌళి స్టార్ డైరెక్ట‌ర్‌. కీర‌వాణి స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. వీళ్లంతా క‌లిస్తే ప్ర‌భంజ‌న‌మే. దేశంలోనే టాప్ 3 సినిమాల్లో రెండిటికి విజ‌యేంద్రుడే రైట‌ర్‌. బాహుబ‌లి - భ‌జ‌రంగి భాయిజాన్ సినిమాల‌తో తిరుగులేని రైట‌ర్‌ గా పాపుల‌ర్ అయ్యారు. అంత క‌థ ఉంద‌న్న‌మాట!
Tags:    

Similar News