• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతి సినిమాల మధ్య...

సంక్రాంతి సినిమాల మధ్య వ్యూస్ పోటీ!

By - Tupaki Desk
Update: 2019-11-24 06:02 GMT
సినిమా కలెక్షన్స్ కంటే యూట్యూబ్ వ్యూస్.. లైక్స్ ఇప్పుడు ప్రధానంగా మారి పోయాయి.  నిజానికి ఒక సినిమాకు కావాల్సింది కలెక్షన్లు.  ఒక సినిమాకు సంబంధించిన టీజర్.. ట్రైలర్.. సాంగ్స్ వీటిలో దేనికి వ్యూస్ లేకపోయినా కలెక్షన్స్ వస్తే చాలు.  కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కలెక్షన్స్ సంగతి తర్వాత చూద్దాం.. ముందు వ్యూస్ సంగతి తేలుద్దాం అన్నట్టుగా ఉంది.

సంక్రాంతి పోటీలో ఉన్న సినిమాల లో ప్రముఖమైనవి అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'.. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.  అల్లు అర్జున్ టీమ్ చాలా ముందుగా ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టి పాటలు విడుదల చేశారు.  ఇప్పటికే 'సామజవరగమన'.. 'రాములో రాముల' పాటలు కోట్ల కొద్ది వ్యూస్ తో రికార్డులు సృష్టిస్తున్నాయి.   దీంతో 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ వెనకబడింది అనుకున్నారు.  అయితే ఈమధ్యే రిలీజ్ అయిన 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ వ్యూస్ విషయం లో దూసుకు పోతోంది. ఇప్పటికే రెండుకోట్ల వ్యూస్ దాటాయని అంటున్నారు.  ఇక పోటీలో రిలీజ్ అయిన అల్లు అర్జున్ 'OMG డాడీ' కి మొదటి రెండు సాంగ్స్ కు వచ్చిన స్పందన దక్కలేదు.  కారణం అది తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా ఆదరణ లేని ర్యాప్ స్టైల్ లో ఉండడమే. ఇవన్నీ పక్కన పెడితే 'అల వైకుంఠపురములో' పాటలు 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ పై ఎలా ఒత్తిడిని పెంచాయో ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ 'అల వైకుంఠపురములో' టీం పై ఒత్తిడి పెంచింది.  దీంతో అల్లు అర్జున్ డిజిటల్ టీమ్ కు టీజర్ రిలీజ్ అయితే వ్యూస్ టార్గెట్ భారీగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది

ఇదంతా సరే.. టీజర్ కు రెండు కోట్ల వ్యూస్.. మూడు కోట్ల వ్యూస్.. నిజంగా ఇవన్నీ టికెట్స్ గా మారతాయా? 'బాహుబలి 2' రికార్డును బ్రేక్ చేయాలంటే 1.5 కోట్ల టికెట్స్ తెగాలని ఒక అంచనా.  నిజంగా ఈ టీజర్ వ్యూస్ అన్నీ టికెట్స్ రూపం లో మారితే బాహుబలి రికార్డ్స్ తుడిచిపెట్టుకుపోతాయి.  మరి మహేష్ బాబు..  అల్లు అర్జున్ లు ఈ రేంజ్ లో వ్యూస్ సాధిస్తున్నారు. దానికి తగ్గట్టే కలెక్షన్స్ సాధిస్తారా అనేది మనకు సినిమాలు విడుదల అయితే తప్ప తెలియదు.
Tags:    
  • Mahesh Babu 
  • Allu Arjun 
  • Alavaikunthapurramulo 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Tollywood News 
  • Telugu Movie News 
  • Tupaki News 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS