ఎన్టీఆర్ సాయం.. ఆ విలన్ ఎగ్జైట్మెంట్

Update: 2017-02-26 10:55 GMT
ఈ మధ్య ఎన్టీఆర్ ట్విట్టర్లో ఒక ఆశ్చర్యకరమైన మెసేజ్ పెట్టాడు. హిందీ నుంచి తెలుగులోకి డబ్ అవుతున్న ‘కమాండో-2’ ట్రైలర్ లింక్ షేర్ చేసి.. ఆ చిత్ర హీరో విద్యుత్ జమాల్ కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. మామూలుగా తారక్ తన సినిమాల గురించే ట్విట్టర్లో స్పందించడం తక్కువ. అలాంటిది ఓ బాలీవుడ్ నటుడి సినిమా గురించి ఇలా స్పందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విద్యుత్.. ఎన్టీఆర్ సినిమాలు ‘శక్తి’.. ‘ఊసరవెల్లి’ల్లో విలన్ పాత్రలు పోషించాడు. ఆ సందర్భంగా మొదలైన స్నేహంతోనే ఎన్టీఆర్ అతడి సినిమా గురించి స్పందించాడు. ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో తనను గుర్తు పెట్టుకుని.. తన సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసేలా చేయడం పట్ల విద్యుత్ చాలా ఎగ్జైట్ అయ్యాడు.

‘కమాండో-2’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన విద్యుత్ మాట్లాడుతూ.. ‘‘మనకు ఓ స్నేహితుడు ఉన్నాడంటే.. అతడికి మనం సపోర్ట్ చేయాలి. అది మనం ఏ స్థాయిలో ఉన్నా సరే. మనం కలిసి పని చేసిన వాళ్లు మన మంచిని కోరడం ఎంతో సంతోషాన్నిస్తుంది. నా సినిమా గురించి మాట్లాడటం ద్వారా ఎన్టీఆర్ నిజమైన సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. ఎన్టీఆర్ గొప్ప నటుడు. అతనో బ్రిలియంట్’’ అని విద్యుత్ జమాల్ అన్నాడు. తనకు సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఆరాధ్య భావం అని చెప్పిన విద్యుత్.. పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. మూడేళ్ల కిందట వచ్చిన ‘కమాండో’కు సీక్వెల్ గా వస్తున్న ‘కమాండో-2’ మార్చి 3న హిందీతో పాటు తెలుగు.. తమిళంలోనూ విడుదలవుతోంది. ఇందులో ఆదా శర్మ కథానాయికగా నటించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News