'వెంటిలేటర్' పై ప్రముఖ దర్శకుడు..పరిస్థితి విషమం!

Update: 2019-02-21 10:49 GMT
టాలీవుడ్ లో అలనాటి దర్శక దిగ్గజాల్లో ఒకరు మన కోడి రామ కృష్ణ ఒకరు అంటే అతిశయోక్తి కాదేమో. ఆయన తెరపై ఆవిష్కరించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సంధర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఆయన పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది..ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో వెంటిలేటర్ సాహాయంతో శ్వాస తీసుకుంటున్నారు. గత కొంత కాలంగా టాలీవుడ్ కి దూరంగా ఉన్న రామకృష్ణ ఆ మధ్య హార్ట్ అట్యాక్ వచ్చి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డారు. అయితే దాని నుంచి కోలుకునే లోపే పెరాల్సిస్ అట్యాక్ తో మళ్లీ ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ఇక గత కొంత కాలంగా ఇంటికే పరిమితం అయ్యారు రామకృష్ణ. ఇదిలా ఉంటే సడన్ గా మళ్లీ ఆయన ఆరోగ్యం తేడా రావడంతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌ లో చేర్పించారు ఆయన కుటుంభ సభ్యులు. అయితే ఆయన పరిస్థితి విషయంగా ఉంది అని, ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నాం అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఇక కోడి రామ కృష్ణ దర్శకుడిగానే కాదు - నటుడుగా కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. ఆరోజుల్లోనే టాలీవుడ్ లో మెగాస్టార్ తో అంజి వంటి గ్ర్యాఫిక్స్ సినిమాను తెరకెక్కించారు. అమ్మోరు సినిమా కూడా ఆయన దర్శకత్వంలోనే వచ్చింది...అది ఎంత పెద్ద హిట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనుకోండీ...ఇక నట సింహం బాల కృష్ణ కరియర్ లో భారీ హిట్స్ గా నిలిచిన మంగమ్మగారి మనవడు - ముద్దుల మావయ్య సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చినవే. వెంకీతో శత్రువు...ఇలా బడా హీరోలతో ఎన్నో హిట్ చిత్రాలను అందించారు రామకృష్ణ. ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకుడు త్వరగా కోలుకోవాలి అని మనస్పూర్తిగా ఆశిస్తున్నాం.

Tags:    

Similar News