రెండు సినిమాల సారం తీసుకున్న వెంకీమామ??

Update: 2019-12-10 09:20 GMT
తెలుగులో ఒక సినిమా వస్తుందంటే చాలు వెంటనే ఆ సినిమా కథ ఏంటి.. ఆ సినిమాకు ప్రేరణ ఏంటి అనేవి హాట్ టాపిక్ గా మారతాయి. ఇప్పటికే సంక్రాంతి సినిమాలు 'అల వైకుంఠపురములో'.. 'సరిలేరు నీకెవ్వరు' ఫలానా సినిమాలకు ప్రేరణ అని.. ఫలానా సినిమాలకు కాపీ అని ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా 'వెంకీమామ' విషయంలో కూడా అలాంటి వార్తలే వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు రెండు సినిమాల నుంచి ప్రేరణ తీసుకున్నారని అంటున్నారు.  ఆ సినిమాలలో ఒకటి సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయిజాన్' కాగా రెండవ సినిమా మణిరత్నం 'రోజా'. ఈ రెండు సినిమాలనుంచి కీలక పాయింట్లను తీసుకుని మిక్సీలో వేసి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ను జోడించి 'వెంకీమామ' కథను వండారని అంటున్నారు.  ప్రోమోస్ లో ఈ సినిమాల ఛాయలు కనిపించడం లేదు కానీ 'వెంకీమామ' కథకు మాత్రం ఈ సినిమాలతో లింక్ ఉందని అంటున్నారు. అయితే ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే మాత్రం డిసెంబర్ 13 వరకూ వేచి చూడకతప్పదు.

ఈ ప్రేరణల ఆరోపణలు చేసే పాషాణ హృదయులు ఎప్పుడూ ఉంటారు కాబట్టి జనాలు కూడా వీటిని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు.. రెండున్నర గంటలలో రెండు గంటలు సామాజిక తత్వవేత్తల తరహాలో క్లాసులు పీకి బెదరగొట్టకుండా ఉంటేచాలని.. అదే పదివేలని.. ఆరోగ్యానికి మేలని అనుకుంటున్నారు.  మరి 'వెంకీమామ' ఈ విషయంలో ప్రేక్షకులను మెప్పిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
Tags:    

Similar News