50 వేల‌తో అదే క్వాలిటీతో అమ్మ‌నాన్న‌!

ర‌చ‌యిత‌..న‌టుడు..ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళి కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2024-05-04 13:30 GMT

ర‌చ‌యిత‌..న‌టుడు..ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళి కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పోసాని మ‌ల్టీ ట్యాలెంటెడ్ ప‌ర్స‌నాల్టీ. అందులోనూ న‌టుడిగా ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల న‌టుడు. నెగిటివ్ రోల్ అయినా...పాజిటివ్ రోల్ అయినా త‌న‌దైన మార్క్ పెర్పార్మెన్స్ తో ఆక‌ట్టుకోవ‌డం పోసాని ప్ర‌త్యేక‌త‌. న‌టుడిగా త‌న‌కంటూ ఓ శైలిని..ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న న‌టుడు. ఇండ‌స్ట్రీకి రైట‌ర్ గా వ‌చ్చి న‌టుడిగా స‌క్సెస్ అయ్యారు. ఇండ‌స్ట్రీ నుంచి ఆయ‌న‌కు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు.

అంతా స్వ‌యంకృప‌రాధ‌మే. తాజాగా త‌ల్లిదండ్రుల గురించి పోసాని ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం రివీల్ చేసారు. పోసాని ఇంట్లోకి వెళ్తే హాలులో ఎదురుగా త‌ల్లిదండ్రులో ఫోటో ఒక‌టి క‌నిపిస్తుంది. పెద్ద ప్రేమ్ తో పెద్ద ఫోటో చేయించి పెట్టారు. అయితే ఆ ఫోటో అలా త‌యార‌వ్వ‌డానికి పోసాని 50 వేల రూపాయ‌లు ఖర్చు చేసారుట‌. పోసాని ద‌గ్గ‌ర‌ తల్లిదండ్రుల‌కు సంబంధించి చిన్న రెవెన్యూ స్టాంప్ ఫోటో మాత్ర‌మే ఉందిట‌. అదీ కూడా చిన్న‌ప్పుడు పోసాని మేన‌మామ తీయ‌డంతో ఆ ముక్క దొరికింద‌న్నారు.

Read more!

దీంతో ఆ ఫోటోని పెద్ద‌ది కావాల‌ని ప్ర‌య‌త్నించ‌గా ఇప్పుడొచ్చిన అడ్వాన్స్ జ‌ర్మ‌న్ టెక్నాల‌జీతో అదే క్వాలిటీతో పెద్ద ఫోటో వ‌స్తుంద‌ని ఓల్డ్ సిటీలో దాన్ని పెద్ద ఫోటోగా మార్పించారుట‌. అందుకుగానూ 50 వేలు ఖర్చు అయిన‌ట్లు తెలిపారు. త‌న‌పై తండ్రి కంటే త‌ల్లి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు. తల్లి త‌న‌లాగే డేరింగ్ అని..త‌న‌కి ఆమె ఆద‌ర్శంగా ఉన్నార‌న్నారు. పోసాని త‌ల్లిదండ్రులు శేష‌మ్మ‌..పోసాని సుబ్బారావు. ఇద్ద‌రు స్వ‌ర్గ‌స్తుల‌య్యారు.

ప్ర‌స్తుతం పోసాని ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. వైకాపా త‌రుపున ప్ర‌చారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో అవ‌కాశాలు కూడా త‌గ్గాయ‌న్నారు. ఇండస్ట్రీలో రాజ‌కీయాలు కూడా అందుకు కార‌ణ‌మ‌ని గ‌త ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసారు. అయినా త‌న‌కి రావాల‌నుకున్న పాత్ర‌లు మాత్రం వ‌స్తున్నాయ‌న్నారు.

Tags:    

Similar News