వెంకీ భయపడ్డాడండీ.. తప్పేలేదు

Update: 2017-04-07 10:32 GMT
ఈ మధ్యకాలంలో చాలాసార్లు సీనియర్ హీరో వెంకటేష్‌ ఒక దర్శకుడితో పనిచేయాలంటే.. తన గత సినిమాల ట్రాక్ రికార్డు నుండి.. ప్రస్తుతం చెప్పే కథ వరకు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అందుకే చాలా గ్యాప్ తీసుకుని ఆలోచించుకుని ''గురు'' సినిమా చేశాడు. ఒరిజనల్ వర్షన్ చూశాకనే ఈ సినిమాను చేయడానికి నిర్ణియించుకున్నాడు. అందుకే ఇప్పుడు పూరి జగన్ తో చేయాల్సిన సినిమా విషయంలో కూడా మరో ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

నిజానికి పూరి జగన్ డైరక్షన్లో వెంకీ సినిమా దాదాపు ఎనౌన్స్ అవుతోంది అనుకుంటుండగా.. ఆ సినిమా గురించి అసలు ఒక చిన్న ఊసు కూడా బయటకురాలేదు. అంతే కాదు.. ఆ తరువాత పూరి వెంటనే బాలకృష్ణతో సినిమాను చేస్తున్నట్లు ప్రకటించడం.. ఆ సినిమా లాంచ్ అయిపోవడం.. ఆ సినిమా షూటింగ్ కూడా మొదలవ్వడం చకచకా జరిగిపోయాయ్. అయితే వెంకీ మాత్రం.. పూరి జగన్ డైరక్షన్లో అనుకున్న సినిమా ఆగిపోలేదని ఆ మద్యన చెప్పాడు.

కాకపోతే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. రోగ్ రిజల్టు చూసిన వెంకటేష్‌.. ఇప్పడు పూరి జగన్ డైరక్షన్లో సినిమా అంటే భయపడ్డాడడట. ఇప్పుడే కాదులో కాస్త ఆగాక చేద్దాం అంటూ సిగ్నల్ ఇచ్చేసి.. ఈ ప్రాజెక్టును ఆపేసినట్లు తెలుస్తోంది. ఎంతవరకు నిజం అనేది వెంకీ అండ్ పూరీకే తెలియాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News