• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెంకీ కోసం చందూ...

వెంకీ కోసం చందూ క్రియేటివిటీ

By - Tupaki Desk
Update: 2016-06-20 11:30 GMT
రీమేక్ సినిమా అంటే రిస్కుతో కూడుకున్న వ్యవహరం. ఉన్నదున్నట్లు తీస్తే కాపీ పేస్ట్ చేశారు. ఇంకేం లేదు అంటారు. మార్పులు చేర్పులు చేస్తే మాతృకను చెడగొట్టారు అంటారు. అందుకే రీమేక్స్ తీయడం కత్తిమీద సాము. మరి ‘కార్తికేయ’ లాంటి సెన్సేషనల్ మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన చందూ మొండేటి రెండో ప్రయత్నంలో మలయాళ బ్లాక్ బస్టర్ ‘ప్రేమమ్’ను రీమేక్ చేస్తుండటంతో ఇందులో అతను ముద్ర ఎలా ఉండబోతోందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఐతే యూనిట్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం.. మాతృకలోని ఫీల్ చెడకుండానే తెలుగు నేటివిటీకి తగ్గట్లు మంచి మార్పులే చేశాడట చందూ.

హీరో నాగచైతన్య మేనమామ వెంకటేష్.. ఇందులో ఓ క్యామియో రోల్ చేస్తున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. విక్టరీ హీరో ఆ క్యారెక్టర్ చేస్తున్న మాట వాస్తవమే. మలయాళ వెర్షన్ చూసిన చాలామంది అది హీరో తండ్రి పాత్ర అనుకుంటున్నారు. కానీ వెంకీ క్యారెక్టర్ అది కాదట. ఈ పాత్రను కొత్తగా క్రియేట్ చేశాడట చందూ. ఈ క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని.. ఉన్నంతసేపు చక్కటి వినోదం పంచుతుందని అంటున్నారు. సినిమాకు ఇది ఓ హైలైట్ గా నిలుస్తుందని కూడా చెబుతున్నారు. ‘ప్రేమమ్’ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. వచ్చే నెలలోనే దీని ఆడియో విడుదల కాబోతోంది. ‘సాహసం శ్వాసగా సాగిపో’ రిలీజ్ డేట్ ఖరారయ్యాక దీని విడుదలపై ఓ అవగాహన వస్తుంది.
Tags:    
  • Venkatesh 
  • Naga Chaitanya 
  • Premam Movie 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS