30 ఏళ్ల తర్వాత మళ్లీ వెంకీ ఆ పాత్రలో..!

Update: 2020-10-28 15:00 GMT
వెంకటేష్‌ ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ ను ఆకట్టుకునే ఎన్నో పాత్రలు చేశాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా దాదాపు 30 ఏళ్ల క్రితం 'సుందరాకాండ' సినిమాలో లెక్చరర్‌ పాత్రలో నటించాడు. ఆ సినిమాకు సంబంధించిన పాటలు మరియు సన్నివేశాలు ఇప్పటికి చాలా ఫేమస్‌. లెక్చరర్‌ గా వెంకీ పండించిన హాస్యం మరియు ఎమోషన్‌ సినిమాకు హైలైట్‌ గా నిలిచాయి. ఆ సినిమా విడుదలైన ఇన్నాళ్లకు మళ్లీ వెంకటేష్‌ లెక్చరర్‌ గా నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం నారప్ప సినిమా షూటింగ్‌ కు రెడీ అవుతున్న వెంకటేష్‌ ఆ వెంటనే అంటే వచ్చే ఏడాది ఆరంభంలోనే 'ఎఫ్‌ 3' సినిమా షూటింగ్‌ లో పాల్గొనబోతున్నాడు. ఇక వచ్చే ఏడాది సమ్మర్‌ లో తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో వెంకీ ఒక సినిమాను చేయబోతున్నాడు. గుర్రపు పందేలు బ్యాక్‌ డ్రాప్‌ లో రూపొందబోతున్న ఆ సినిమాలో వెంకటేష్‌ లెక్చరర్‌ పాత్రలో కనిపించబోతున్నాడు అనేది సురేష్‌ ప్రొడక్షన్స్‌ వర్గాల మాట.

లెక్చరర్‌ అయిన హీరో గుర్రపు పందేలపై ఆసక్తితో ఏం చేశాడు అనేది సినిమా కథాంశంగా ఉంటుందని వెంకీ ఇమేజ్‌ కు తగ్గట్లుగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తరుణ్‌ భాస్కర్‌ ఈ స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడు. సురేష్‌ బాబుకు కథ బాగా నచ్చడంతో తానే స్వయంగా నిర్మించేందుకు సిద్దంగా ఉన్నాడు. వచ్చే ఏడాది సమ్మర్‌ తర్వాత షూటింగ్‌ ప్రారంభం అయ్యి వచ్చే 2022 ఆరంభంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ లో రూపొందబోతున్న ఈ సినిమాలో వెంకీ లెక్చరర్‌ గా కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు తారా స్థాయికి చేరాయి.
Tags:    

Similar News