'అఖిల్‌' ను చరణ్‌ చేసి ఉంటే మరోలా ఉండేది

Update: 2021-04-25 09:30 GMT
అక్కినేని ఫ్యామిలీ నుండి అఖిల్‌ హీరోగా 'అఖిల్‌' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. నితిన్ నిర్మాణంలో రూపొందిన అఖిల్‌ ప్లాప్ గా మిగిలింది. వి వి వినాయక్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో రూపొందిన అఖిల్‌ సినిమా ప్లాప్‌ కు పలు కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా కొత్త హీరోకు అంతటి స్ట్రాంగ్‌ కథను ఇవ్వడం అంటున్నారు. అఖిల్‌ మొదటి సినిమా కనుక లైట్‌ పాత్రతో సింపుల్‌ కథాంశంతో పరిచయం చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది అనేది కొందరి అభిప్రాయం. అఖిల్‌ సినిమా కథ రచయిత వెలిగొండ శ్రీనివాస్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

అఖిల్ సినిమా కథ ను నేను రామ్‌ చరణ్‌ ను దృష్టిలో పెట్టుకుని రాశాను. అప్పటికే మంచి స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్న రామ్‌ చరణ్‌ ఆ కథతో సినిమా చేసి ఉంటే ఫలితం ఖచ్చితంగా మరోలా ఉండేది. నేను రాసుకున్న కథను అఖిల్‌ ఇమేజ్‌ కు తగ్గట్లుగా చాలా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అఖిల్‌ పాత్రను మరీ ఎక్కువ చూపించడం వల్ల నష్టం జరిగింది. మేము అనుకున్న దానికి సినిమా ఫలితం పూర్తి డిఫరెంట్‌ గా వచ్చిందని రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ పేర్కొన్నాడు.
Read more!

మొదటి సినిమా ప్లాప్ అవ్వడంతో అఖిల్ అక్కినేని ఇప్పటి వరకు కూడా సక్సెస్‌ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అఖిల్ నిర్మాత నితిన్ కు కూడా భారీ నష్టాలను మిగిల్చింది. వి వి వినాయక్‌ కెరీర్‌ లో ఒక పెద్ద ప్లాప్ గా మిగిలి పోయింది. రచయిత వలిగొండ శ్రీనివాస్ కూడా ఆ తర్వాత ఎక్కువగా కనిపించింది లేదు. మొత్తానికి అఖిల్‌ సినిమా ను చరణ్ కాకుండా అఖిల్‌ చేసినందుకు చాలా పరిణామాలు జరిగాయంటూ రచయిత తన మనసులో మాట బయట పెట్టాడు.
Tags:    

Similar News